Royal Enfield EV: ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేస్తోంది.. డుగ్గు డుగ్గు మనే సౌండ్ లేకుండానే..

|

Apr 12, 2023 | 4:00 PM

ఒకప్పుడు అది ఓ స్టేటస్ సింబల్. ప్రస్తుతం యూత్ ఐకాన్ బైక్. అయితే అటువంటి బండి సౌడ్ లేకుండా, కనీసం సైలెన్సర్ లేకుండా రోడ్లపై పరుగులు పెట్టడానికి సిద్ధమైంది. అర్థం కాలేదా? అదేనండి ఎలక్ట్రిక్ వేరియంట్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లాంచింగ్ సిద్ధమైంది.

Royal Enfield EV: ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేస్తోంది.. డుగ్గు డుగ్గు మనే సౌండ్ లేకుండానే..
Royal Enfield Ev
Follow us on

రాయల్ ఎన్‌ఫీల్డ్ .. ఆ పేరే ఓ వైబ్రేషన్. డుగ్గు డుగ్గు మని సౌండ్ చేసుకుంటూ అది వస్తుంటే ఆ రేంజ్ వేరు. ఒకప్పుడు అది ఓ స్టేటస్ సింబల్. ప్రస్తుతం యూత్ ఐకాన్ బైక్. అయితే అటువంటి బండి సౌడ్ లేకుండా, కనీసం సైలెన్సర్ లేకుండా రోడ్లపై పరుగులు పెట్టడానికి సిద్ధమైంది. అర్థం కాలేదా? అదేనండి ఎలక్ట్రిక్ వేరియంట్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లాంచింగ్ సిద్ధమైంది. పలు ఆన్ లైన్ నివేదికల ప్రకారం సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ను త్వరలోనే పరిచయం చేయనుంది. మొదటిగా నమూనాను ప్రదర్శించి, వచ్చే ఏడాది కొత్త బైక్ ను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకోసం చెన్నైలో ప్రత్యేక షోరూం ప్రారంభించనుంది.

రెండు మోడళ్లు..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాయల్ ఎన్ ఫీల్డ్ రెండు రకాల ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ లను మార్కెట్లోకి ఒకేసారి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి ఎల్1ఏ(L1A) అనే కోడ్ నేమ్ సంస్థే తయారు చేస్తుండగా, మరొక మోడల్ ను స్టార్క్ మోటార్ సైకిల్ అనే స్పానిష్ ఈవీ స్టార్టప్ తో సంయుక్తంగా తయారు చేస్తోంది. కొత్త లాంచ్ చేసే ఈ బైక్ లు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాక అంతర్జాతీయంగా కూడా పలు దేశాలలో విక్రయించేలా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.

వచ్చే ఏడాది మార్కెట్లోకి..

రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్ L1A వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని పనితీరు రాయల్ ఎన్ ఫీల్డ్ బ్రాండ్ నేమ్ కు తగినట్లుగా ఉంటుందని సంస్థ చెబుతోంది. అలాగే మరో మోడల్ కోసం స్పానిష్ ఆఫ్ రోడ్ లో మంచి పేరుగడించిన ఈవీ స్టార్టప్ స్టార్క్ మోటార్ సైకిల్ తో కలిసి పనిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం ఇలా ఉండొచ్చు..

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ కి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే దీనిలోని మోటార్ కెపాసిటీ కూడా పెట్రోల్ బైక్ మోడళ్లలో ఉన్నట్లుగా 350సీసీ నుంచి 650సీసీ వరకూ ఉండొచ్చని అంచనా. ఇందులో శక్తివంతమైన 10kwh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ నుంచి 500 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి సుమారు 8-10 గంటలు పడుతుంది అని పలు నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..