Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధర పెంచేశారు.. ఇసారి ఎంత పెరిగిందంటే..!

|

Feb 27, 2021 | 11:24 PM

Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. అయితే, ఈ బైక్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే అనాలి.

Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధర పెంచేశారు.. ఇసారి ఎంత పెరిగిందంటే..!
Follow us on

Royal Enfield Bullet: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. అయితే, ఈ బైక్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే అనాలి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ తన బైక్‌ల ధరలను మరోసారి పెంచింది. ముఖ్యంగా బుల్లెట్ 350 బీఎస్-6 ధరను మరోసారి పెంచింది. ప్రస్తుతం ఉన్న ధర మీద దాదాపు రూ. 9 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు. ఇతర వేరియంట్లపైనా స్వల్పంగా ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇతర మోడళ్లపై రూ. 3,100 నుంచి 3,500 వరకు పెంచినట్లు సంస్థ తెలిపింది. 2020లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధర రూ.1.21 లక్షలు ఉండగా, ఇప్పుడు ఆ ధర రూ. 1.30 లక్సలకు చేరింది.

ఇంత‌కుముందు బుల్లెట్ 350 స్టాండ‌ర్డ్ ధ‌ర రూ.1,27,094 కాగా, బ్లాక్ అండ్ ఫారెస్ట్ గ్రీన్ షేడ్ వేరియంట్ రూ.1,33,261, బుల్లెట్ 350 ఈఎస్ (ఎల‌క్ట్రిక్ స్టార్ట్‌) ధ‌ర రూ.1,42,705కు ల‌భించగా.. ఇప్పుడు బుల్లెట్‌ 350 స్టాండర్డ్ ధ‌ర‌ రూ.1,30,228గా ఉంది. ఇక బుల్లెట్ 350 (బ్లాక్ అండ్ ఫారెస్ట్‌ గ్రీన్‌‌)..రూ.1,36,502ల‌కు, బుల్లెట్‌ 350 ఈఎస్‌ (ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌) రూ. 1,46,152ల‌కు ల‌భిస్తున్నాయి. కాగా, 2021లో ఈ మోడల్ ధరను పెంచడం ఇది రెండవసారి. మార్కెట్‌లో ముడి విభాగాలు, ఇతర పరికరాల ధరలు పెరగడంవల్లే మళ్లీ దరలు పెంచాల్సి వస్తోందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ప్రకటించింది.

Also read:

ఈ పబ్లిక్ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా..? అయితే నగదు లావాదేవీల్లో ఇబ్బందులు తప్పవు.. వెంటనే మీ బ్యాంక్‌ను సంప్రదించండి..

మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు అరుస్తాయి, పిచ్చి కుక్కలు కరుస్తాయి మనం తిరిగి కరవం కదా అంటూ వీరమహిళలతో జనసేనాని

తమిళనాట మూడో కూత మొదలైంది.. కో అంటే కొక్కొరొకో అంటున్న మనసు పడ్డ నేతలు.. ఎవరిని వరిస్తుందో అదృష్ట దేవత..