స్టాక్‌ మార్కెట్లపై రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత వార్నింగ్‌! భయపడొద్దు.. అవకాశంగా మార్చుకోండి అంటూ..

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి త్వరలోనే స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుందని హెచ్చరించారు. అయితే, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవచ్చని, జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సూచించారు. 2008 సంక్షోభాన్ని అనుభవంగా మార్చుకున్న తన అనుభవాన్ని పంచుకుంటూ, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం గురించి హెచ్చరించారు.

స్టాక్‌ మార్కెట్లపై రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయిత వార్నింగ్‌! భయపడొద్దు.. అవకాశంగా మార్చుకోండి అంటూ..
Robert Kiyosaki

Updated on: May 03, 2025 | 12:57 PM

స్టాక్‌ మార్కెట్లలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఆశతో స్టాక్స్‌పై సరైన అవగాహన లేకపోయినా.. భారీగా డబ్బులు పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి వారికే కాక.. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే అందరికీ ఒక షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌ పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి. సమీప భవిష్యత్తులో స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతాయని అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా.. దీన్నో అవకాశంలా భావించాలని కూడా అంటున్నారు. ఇటీవలె ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు అందులో పలు విషయాలపై స్పందించారు. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ లాగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ సమస్య వాస్తవికత గురించి చెప్పారు.

రానున్న మహా మాంద్యం గురించి హెచ్చరించిన తన మునుపటి పుస్తకాన్ని ప్రస్తావిస్తూ పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు. నా అంచనా ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. స్టాక్‌ మార్కెట్లు క్రాష్‌ అవుతాయి. అందుకు భయపడొద్దు.. సిద్ధంగా ఉండాలి. దాన్ని ఒక అవకాశంలా భావించాలని అంటూ వెల్లడించారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, దానిని సంక్షోభం కంటే కూడా ఒక అభ్యాస అవకాశంగా మార్చడానికి తాను ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు. సంక్షోభ సమయంలో తెలివిగా పెట్టుబడి పెట్టాలని అన్నారు. మార్కెట్ పతన సమయంలో నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక అంశాలు స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి కనుక మార్కెట్అల్లకల్లోల స్థితిలో పానిక్ సెల్లింగ్ ఒక సాధారణ విషయం అని అన్నారు.

బిట్‌కాయిన్ ధర 300 డాలర్లకు పడిపోతే.. మీ బాధపడతారా? సంతోషిస్తారా? అని ప్రశ్నించారు. అలా జరిగితే అది పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అని అన్నారు. “మీరు కొనుగోలు చేసినప్పుడు లాభం వస్తుంది, అమ్మినప్పుడు కాదు” అని అని రాబర్ట్‌ అన్నారు. అయితే తాను ఈ పోస్ట్‌ చేయడానికి ఒక కారణం ఉందని రాబర్ట్‌ వెల్లడించారు. తన ప్రేక్షకులను ఆర్థిక మాంద్యం గురించి సిద్ధంగా ఉంచాలని ఈ పోస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మహా ఆర్థిక మాంద్యం ఆలెడ్రీ మొదలైంది అని కూడా ఆయన తెలిపారు. ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ, ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్‌ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్‌ పోస్ట్‌కు జోడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి