Hyderabad: హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గత ఏడాది నార్మల్‌గా ఉన్న ధరలు ఒక్క సారిగా పెరిగిపోయయని ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇది అధికంగా ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నివాసానికి ఆమోదయోగ్యమైన నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. గతేడాది కరోనా వల్ల కొంత తగ్గముఖం పట్టినా ప్రస్తుతం గృహ మార్కెట్ బాగానే విస్తరిస్తోంది.
దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులలో ఈ మూడు నగరాల్లోనే 43 శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది. మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని తెలిపింది. ఇక్కడ మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో అత్యధిక ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభం కాగా.. 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది.
Online Loan Apps: ఆన్‌లైన్ యాప్‌లపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. యాప్‌ల సూత్రధారులు విదేశాల్లో..