పుత్తడి పరుగు.. 80వేలను దాటేస్తుందా..!

మొన్నటి వరకు కాస్త తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు., మళ్లీ పరుగులు పెడుతున్నాయి. జాతీయంగా గురువారం బంగారం ధర భారీగా పెరిగింది.

పుత్తడి పరుగు.. 80వేలను దాటేస్తుందా..!

Edited By:

Updated on: Jul 02, 2020 | 3:43 PM

మొన్నటి వరకు కాస్త తగ్గినట్లే కనిపించిన బంగారం ధరలు., మళ్లీ పరుగులు పెడుతున్నాయి. జాతీయంగా గురువారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం రూ.470 పెరుగుదలతో రూ.50,950కు ఎగబాగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరిగి, రూ.46,740కు చేరింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

కాగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ బంగారం రేటు పెరగడానికి విశ్లేషకులు పలు కారణాలను చెబుతున్నారు. మార్కెట్‌లలో స్టాక్స్‌, బాండ్‌ల మీద పెట్టే పెట్టుబడి పెద్దగా లాభాలను ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అందరు బంగారంవైపు చూస్తున్నారు. బంగారంపై పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుండటంతో దాన్ని కొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది చివరికి భారత్‌లో బంగారం ధర రూ.80వేలు దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. హాంగ్‌కాంగ్‌ గొడవ, కరోనా విపత్కర పరిస్థితులు కూడా బంగారం ధరపై ప్రభావాన్ని చూపుతున్నాయని వారు వివరించారు.