Banks: ఫిబ్రవరిలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు.. ఏయే తేదీల్లో అంటే..
పెన్షన్‌లు మొదలు పథకాల వరకు అన్నింటికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కావడంతో అందరూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో బ్యాంకుల పనివేళలు, పనిదినాల గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతీ నెల బ్యాంకుల సెలవు దినాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు అందజేస్తుంది...

ఒకప్పుడు బ్యాంకులకు ప్రజలకు మధ్య ఇంతలా సంబంధాలు ఉండేవి కావు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, పెన్షన్లు, పథకాలు ఇలా రకరకాల కారణాల వల్ల దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయి. మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలకు బ్యాంక్ అకౌంట్ అనివార్యంగా మారింది.
పెన్షన్‌లు మొదలు పథకాల వరకు అన్నింటికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి కావడంతో అందరూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో బ్యాంకుల పనివేళలు, పనిదినాల గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతీ నెల బ్యాంకుల సెలవు దినాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు అందజేస్తుంది. సదరు నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవన్న విషయాన్ని ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవన్న వివరాలను ఆర్‌బీఐ ప్రకటించింది. ఇంతకీ ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవు దినాలపై ఓ లుక్కేయండి..
* ఫిబ్రవరి 4వ తేదీన నెలలో ఆదివారం రోజున దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.
* ఇక ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
* ఫిబ్రవరి 11వ తేదీన ఆదివారం రోజున దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
* ఫిబ్రవరి 14వ తేదీన బసంత్ పంచమి / సరస్వతి పూజ కారణంగా, త్రిపుర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 15వ తేదీన లూయిస్-నాగై-ని పురస్కరించుకొని మణిపూర్‌లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
* ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం రోజున బ్యాంకులు పనిచేయవు.
* ఇక ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి కారణంగా మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 20వ తేదీన రాష్ట్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 24వ తేదీన రెండో శనివారాన్ని పురస్కరించుకొని.. బ్యాంకులకు సెలవు ఉంటుంది.
* ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం రోజున దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు పనిచేయవు.
* ఇక ఫిబ్రవరి 26వ తేదీన న్యోకుమ్ కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఇదిలా ఉంటే పైన పేర్కొన్న తేదీల్లో బ్యాంకులు పనిచేయకపోయినా.. ఆన్‌లైన బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ యథావిథిగా పనిచేస్తాయి. అలాగే బ్యాంకింగ్‌కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఆయా బ్యాంకుల కస్టమర్ కేర్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




