JioPhone Next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్.. అదిరిపోయేలా ఫోన్ మేకింగ్ వీడియో..

|

Oct 25, 2021 | 10:35 PM

దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధఇంచిన..

JioPhone Next: ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్.. అదిరిపోయేలా ఫోన్ మేకింగ్ వీడియో..
Reliance Jio Unveils Jiopho
Follow us on

JioPhone Next: దీపావళి రాబోతున్న నేపథ్యంలో ‘మేకింగ్ ఆఫ్ జియో ఫోన్ నెక్ట్స్’ ను జియో విడుదల చేసింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కు సంబంధఇంచిన ఆశయం, దాని ఆవిష్కరణ వెనుక ఉన్న ఆలోచనలను ఈ షార్ట్ వీడియో తెలియజేస్తుంది. భారతీయత కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్న ఈ నూతన ఫోన్ ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే జియో భారత్ లో ఇంటింటా వినిపించే పేరుగా మారింది. 43 కోట్ల మంది వినియోగదారులతో అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల్లో, ఆదాయ వర్గాల్లో దీని సేవలు విస్తరించాయి. భారతదేశంలో డిజిటల్ అనుసంధానతను ప్రజాస్వామీకరించాలన్న తన ఆశయాన్ని జియో ఫోన్ నెక్ట్స్ తో జియో మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది.

జియో ఫోన్ నెక్ట్స్ అనేది భారతదేశంలో తయారైంది. భారతదేశం కోసం తయారైంది. భారతీయులచే తయారుచేయబడింది. డిజిటల్ సాంకేతికతకు ప్రతీ భారతీయుడు కూడా సమాన అవకాశాలు, సమాన యాక్సెస్ పొందేలా జియో ఫోన్ నెక్ట్స్ చేస్తుంది. కోట్లాది మంది భారతీయుల జీవితాలను మార్చేలా జియో ఫోన్ నెక్ట్స్ ఎలా తయారైందో ఈ వీడియో తెలియజేస్తుంది.

ఆండ్రాయిడ్ శక్తితో కూడిన ప్రగతి ఓస్ అంతర్జాతీయ స్థాయి ఆపరేటింగ్ సిస్టమ్. ప్రత్యేకించి భారతదేశం కోసం రూపొందించబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ జియో ఫోన్ నెక్ట్స్ కు గుండెకాయగా ఉంటుంది. ‘ప్రగతి’ని అందరికీ అందించాలన్న ఆశయంతో జియో, గూగుల్ లోని అత్యుత్తమ నిపుణులతో ఇది రూపుదిద్దుకుంది. ఇది అందుబాటు ధరలో తిరుగులేని అనుభూతిని అందిస్తుంది.

జియో ఫోన్ నెక్ట్స్ ప్రాసెసర్ సాంకేతిక అగ్రగామి అయిన క్వాల్ కామ్ చే రూపొందించబడింది. జియో ఫోన్ నెక్ట్స్ లో ఉండే క్వాల్ కామ్ ప్రాసెసర్ ఈ ఉపకరణం పనితీరు, ఆడియో, బ్యాటరీలను గరిష్ఠ స్థాయిలో పని చేసేలా చేయడమే గాకుండా అత్యుత్తమ రీతిలో అనుసంధానతను, లొకేషన్ సాంకేతికతలను అందిస్తుంది.

జియో ఫోన్ నెక్ట్స్ యొక్క కొన్ని విశిష్ట ఫీచర్లు:

వాయిస్ అసిస్టెంట్:
ఈ ఉపకరణాన్ని వినియోగించడంలో వినియోగదారులకు వాయిస్ అసిస్టెంట్ తోడ్పడుతుంది. తమకు బాగా తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సులభంగా సమాచారాన్ని, కంటెంట్ ను పొందడంలో సహకరిస్తుంది.

రీడ్ అలౌడ్
ఏ స్క్రీన్ పై అయినా సరే, కంటెంట్ ను బయటకు చదివి వినిపించేందుకు ‘లిజన్’ అనేది వినియోగదారులకు తోడ్పడుతుంది. తాము అర్థం చేసుకోగల భాషలో కంటెంట్ ను ఉపయోగించుకునేందుకు ఇది వినియోగదారు లకు వీలు కల్పిస్తుంది.

ట్రాన్స్ లేట్
‘ట్రాన్స్ లేట్’ అనేది ఏ స్క్రీన్ పై అయినా కూడా తాము ఎంచుకున్న భాషలోకి కంటెంట్ అనువాదం అయ్యేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది. వినియోగదారులు తాము ఎంచుకున్న భాషలో కంటెంట్ ను చదివేందుకు తోడ్పడుతుంది.

సులభమైన స్మార్ట్ కెమెరా
ఈ ఉపకరణం స్మార్ట్, శక్తివంతమైన కెమెరాతో ఉంటుంది. పోట్రయిడ్ మోడ్ వంటి వివిధ ఫోటోగ్రఫీ మోడ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలను చక్కగా తీసేందుకు వీలు కల్పిస్తుంది.

తక్కువ కాంతి ఉన్న సమయంలోనూ ఫోటోలను బాగా తీసేందుకు నైట్ మోడ్ వీలు కల్పిస్తుంది.

కెమెరా యాప్ కూడా ప్రీలోడెడ్ గా వస్తుంది. కస్టమ్ ఇండియన్ అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్లు ఆయా ఫోటోలను మరింతగా మెరుగుపరుస్తాయి. భావోద్వేగాలతో, వేడుకలతో జోడిస్తాయి.

ముందుగానే లోడ్ చేయబడిన జియో, గూగుల్ యాప్స్..
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని, ఉపయోగించగలిగిన అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ను ఈ ఉపకరణం సపోర్ట్ చేస్తుంది. తద్వారా వారికి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే లక్షలాది యాప్స్ ను ఎంచుకునే స్వేచ్ఛను అందిస్తుంది. జియో, గూగుల్ యాప్స్ ఇందులో ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి.

ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్..
జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. దీన్ని వినియోగిస్తున్న కొద్దీ, ఆటోమేటిక్ గా అందించబడే అధునాతన ఫీచర్లతో అది మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇబ్బందిరహిత అనుభూతిని అందించేందుకు వీలుగా సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా వస్తాయి.

అద్భుతమైన బ్యాటరీ లైఫ్..
ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన, నూతనంగా డిజైన్ చేయబడిన ప్రగతి ఓఎస్ చక్కటి పనితీరుకు, అదే సమయంలో దీర్ఘకాలం ఉండే బ్యాటరీ జీవితానికి వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి: Amit Shah: జమ్ము కశ్మీర్‌లో అమిత్ షా సాహస నిర్ణయం.. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ తొలిగింపు..

Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. ఐదేళ్ల క్రితం ధోని ఏం చెప్పాడో ఇప్పుడు అచ్చు అలాగే జరిగింది..