జియో కస్టమర్లకు భారీ షాక్..! మొన్న వాయిస్ కాల్స్ బాదుడు.. ఇప్పుడు ఇలా..

| Edited By:

Mar 07, 2020 | 4:10 PM

అనతికాలంలోనే టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో.. వినియోగదారులను ఎలా దగ్గరయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే తొలుత ఆల్ కాల్స్ ఫ్రీ అంటూ దగ్గరైన జియో.. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో సడన్‌గా ఇతర నెట్‌వర్క్స్‌కు చేసే అవుట్ గోయింగ్‌ కాల్స్‌కు ఛార్జీలను వసూలు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఖంగుతినడం జియో కస్టమర్లు వంతైంది. ఇక డేటా ఫ్యాక్స్‌తో పాటుగా.. వాయిస్ కాల్స్‌కు కూడా సెపరేట్ టారిఫ్‌లను ప్రకటించి.. కస్టమర్ల నడ్డీ విరిచింది. తాజాగా తమ […]

జియో కస్టమర్లకు భారీ షాక్..! మొన్న వాయిస్ కాల్స్ బాదుడు.. ఇప్పుడు ఇలా..
Follow us on

అనతికాలంలోనే టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో.. వినియోగదారులను ఎలా దగ్గరయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే తొలుత ఆల్ కాల్స్ ఫ్రీ అంటూ దగ్గరైన జియో.. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో సడన్‌గా ఇతర నెట్‌వర్క్స్‌కు చేసే అవుట్ గోయింగ్‌ కాల్స్‌కు ఛార్జీలను వసూలు చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఖంగుతినడం జియో కస్టమర్లు వంతైంది. ఇక డేటా ఫ్యాక్స్‌తో పాటుగా.. వాయిస్ కాల్స్‌కు కూడా సెపరేట్ టారిఫ్‌లను ప్రకటించి.. కస్టమర్ల నడ్డీ విరిచింది. తాజాగా తమ కస్టమర్లకు మరో భారీ షాక్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. మొన్నటి వరకు కాల్స్‌కు పెంచిన ఛార్జీలకు తోడుగా.. ఇప్పుడు వైర్‌లెస్‌ డేటా టారిఫ్‌లను కూడా పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం 1జీబీ డేటాకు ఉన్న రూ.15 మొత్తాన్ని.. రూ.20కి పెంచే యోచనలో ఉంది. ఇందుకు ట్రాయ్ అనుమతి కోసం ఓ లేఖను కూడా రాసింది. అయితే వాయిస్‌ కాల్స్‌ ధరలను మాత్రం.. ఇంతకు ముందు ఉన్న ధరలనే కొనసాగిస్తామని ఆ లేఖలో పేర్కొంది. అయితే ఈ పెంచిన ధరలను ఇప్పుడే కాకుండా.. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ  పెంచిన డేటా ధరలు అన్ని టారీఫ్‌లకు వర్తిస్తాయని ఆ లేఖలో పేర్కొంది.