Reliance Jio: 12 ఓటీటీ యాప్స్‌నకు ఉచిత యాక్సెస్.. రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు.. రూ. 91 నుంచి ప్రారంభం..

|

Sep 18, 2024 | 3:56 PM

అనువైన ధరల్లో అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన కొత్త ప్లాన్లను మాత్రం జియో తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో ఐదు కొత్త ప్రీ పెయిడ్ రీచార్జ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రకటించింది. ఇవన్నీ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యంతో పాటు పలు జియో యాప్స్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఈ ప్యాక్ లతో పాటు అందిస్తోంది.

Reliance Jio: 12 ఓటీటీ యాప్స్‌నకు ఉచిత యాక్సెస్.. రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు.. రూ. 91 నుంచి ప్రారంభం..
Reliance Jio
Follow us on

రిలయన్స్ జియో.. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సంస్థ. అతి తక్కువ ధరల్లోనే ప్లాన్లను అందిస్తూ వినియోగదారులకు ఫస్ట్ ఆప్షన్ గా మారింది. దేశంలో ఇంటర్ నెట్ వినియోగం మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరిందంటే అందులో రిలయన్స్ జియో పాత్ర కూడా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల దేశంలోని టెలికాం ఆపరేటర్లు అందరూ ధరలను పెంచారు. ఈ క్రమంలో జియో కూడా తన ప్లాన్ల ట్యారిఫ్ ను పెంచింది. దీంతో వినియోగదారుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మొదలైంది. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని టెలికాం ఆపరేటర్లు కలిసి తీసుకున్న నిర్ణయం కావడంతో వెనక్కు తగ్గలేదు. అయితే అనువైన ధరల్లో అద్భుతమైన ప్రయోజనాలతో కూడిన కొత్త ప్లాన్లను మాత్రం జియో తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలో మరో ఐదు కొత్త ప్రీ పెయిడ్ రీచార్జ్ ప్లాన్లను రిలయన్స్ జియో ప్రకటించింది. ఇవన్నీ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి. రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యంతో పాటు పలు జియో యాప్స్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఈ ప్యాక్ లతో పాటు అందిస్తోంది. వీటిల్లో అతి తక్కువ ధర రూ. 91 ప్లాన్ కాగా.. రూ. 449 ప్లాన్ అత్యధిక ధర. ఇంకా రూ. 448, రూ. 399, రూ. 349, రూ. 329 వంటి ప్లాన్లను కూడా అప్ డేట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రిలయన్స్ జియో రూ. 91 ప్లాన్ వివరాలు..

ఇది ప్రత్యేకంగా జియో ఫోన్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన స్కీమ్. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, 50 ఎంఎస్ఎంస్ లు, ప్రతి రోజూ 100ఎంబీ డేటా లభిస్తుంది. జియో యాప్స్ నకు ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్ ను మై జియో యాప్ ద్వారా పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

రిలయన్స్ జియో రూ. 329 ప్లాన్..

ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి రోజు 1.5జీబీ డేటా వస్తుంది. అలాగే జియో యాప్స్, జియో క్లౌడ్, జియో సావన్ ప్రో వంటి వాటికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అయితే జియో సినిమా యాప్ నకు యాక్సెస్ ఉండదు.

రిలయన్స్ జియో రూ. 349 ప్లాన్..

ఈ ప్లాన్ ను హీరో 5జీగా పిలుస్తున్నారు. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్ లు కొనసాగుతాయి. ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్ని జియో యాప్స్ నకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

రిలయన్స్ జియో రూ. 399 ప్లాన్..

ఈ ప్లాన్లో ప్రతి రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ చేసుకునే వీలుంటుంది. జియో యాప్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

రిలయన్స్ జియో రూ. 448 ప్లాన్..

ఈ ప్లాన్లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు 28 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. దీనిలో జియో యాప్స్ తో పాటు దాదాపు 12 ఓటీటీ యాప్స్ నకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. వాటిలో జియో టీవీ, సోనీలివ్, జీ5 వంటివి ఉన్నాయి.

రిలయన్స్ జియో 449 ప్లాన్..

ఈ కొత్త ప్లాన్లో ప్రతి రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్ లు పొందుకుంటారు. ఈ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతోనే వస్తుంది. జియో యాప్స్ నకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..