Jio Recharge: యూజర్లకు జియో అదిరిపోయే అవకాశం.. ఇకపై రీఛార్జ్‌ చేసుకోవడం చాలా సులువు..

|

Jan 07, 2022 | 3:13 PM

Jio Recharge: టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చింది రిలయ్స్‌ జియో. యూజర్లకు తక్కువ ధరలకే అదిరిపోయే ఆఫర్లను అందించి, తక్కువ సమయంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను సొంతం..

Jio Recharge: యూజర్లకు జియో అదిరిపోయే అవకాశం.. ఇకపై రీఛార్జ్‌ చేసుకోవడం చాలా సులువు..
Follow us on

Jio Recharge: టెలికాం రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తూ దూసుకొచ్చింది రిలయ్స్‌ జియో. యూజర్లకు తక్కువ ధరలకే అదిరిపోయే ఆఫర్లను అందించి, తక్కువ సమయంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుందీ జియో. ఇప్పటికీ సరికొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యూజర్ల కోసం మరో మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. సాధారణంగా రీఛార్జ్‌ ప్లాన్‌ ముగిసే విషయాన్ని సంస్థలు మెసేజ్‌ రూపంలో పంపిస్తాయి. కానీ ఒకవేళ ఆ సమయంలో బిజీగా ఉంటే.. రీఛార్జ్‌ చేసుకోవడం మరిచి పోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే జియో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

యూజర్లు ఇకపై యూపీఐ ద్వార తమ టారిఫ్‌ ప్లాన్‌ రీచార్జ్‌ కోసం స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌తో ఆటో డెబిట్‌ ఫీచర్‌ను సెట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి జియో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. యూపీఐ ఆటోపే ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి టెలికాం కంపెనీగా జియో నిలిచింది. ఈ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు మైజియో యాప్‌లో యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలంటే..

* ముందుగా మైజియో యాప్‌లోకి వెళ్లి మొబైల్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి.

* తర్వాత రీచార్జ్‌, పేమెంట్స్‌ విభాగంలో జియో ఆటో పే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* ‘గెట్‌ స్టార్టెడ్‌’పై క్లిక్‌ చేసి మీకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవాలి.

* అనంతరం తర్వాత యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకొని, యూపీఐ ఐడీని ఎంటర్‌ చేసి వెరిఫై చేయాలి.

* దీంతో గడువు తీరిన ప్రతీసారి దానతంట అదే రీఛార్జ్‌ అవుతుందన్నమాట.

Also Read: Raghurama Krishna Raju: ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తా.. మళ్ళీ గెలుస్తా..! RRR ఛాలెంజ్..(వీడియో)

Srihan: సిరి ప్రియుడికి బిగ్ బాస్ భారీ ఆఫర్.? నెట్టింట జోరుగా ప్రచారం.!

T20 Cricket New Rule: టీ20లో కొత్త రూల్‌.. అలా చేయకుంటే బౌలింగ్ టీంకు శిక్ష తప్పదు..!