రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు, ఆఫర్‌లతో ‘డిజిటల్ ఇండియా సేల్’ని తీసుకువస్తుంది. భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ విక్రయంలో అత్యుత్తమ సాంకేతిక ఒప్పందాలను పొందుతున్న రిలయన్స్ డిజిటల్ తన మొదటి దశను ప్రారంభించింది. ఎంతో ఎదురుచూస్తున్న డిజిటల్ ఇండియా సేల్, జూలై 14, 2023 నుంచి ఎలక్ట్రానిక్స్ విక్రయాలు కొనసాగించనుంది. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.10,000 వరకు తక్షణ తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా చాలా ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. వినియోగదారులు ఏవైనా Reliance Digital స్టోర్‌లు లేదా My Jio స్టోర్‌ల నుంచి జూలై 16 వరకు ఈ పరిమిత కాలపు ఆఫర్‌లను పొందవచ్చని, అలాగే ww.reliancedigital.inకి లాగిన్ కావడం ద్వారా ప్రోడక్ట్‌లపై ఆఫర్లతో పాటు సులభమైన ఈఎంఐ పద్దతుల్లో కొనుగోళ్లు జరపవచ్చని తెలిపింది. ఆ సేల్‌లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్‌లు వేగంగా డెలివరీ చేయడంతో పాటు ఉచితంగా ఇన్‌స్టాలేషన్ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది.
డిజిటల్ ఇండియా సేల్‌లో అద్భుతమైన ఆఫర్‌ల శ్రేణిని ఆస్వాదించాలని కోరింది. కొత్తగా ప్రారంభించబడిన OPPO Reno 10 Pro 5G సిరీస్‌ను కేవలం రూ.39,999కే పొందవచ్చు. అలాగే శాంసంగ్ గెలక్సీ ఎస్23 Ultra స్మార్ట్ ఫోన్ రూ.1,06,999, ఇంటెల్ 11వ జెన్ కోర్ i5, 8GB ర్యామ్+ 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో Dell Inspiron 3511 వంటి అద్భుతమైన ల్యాప్‌టాప్‌పై తగ్గింపు ఆఫర్ ఉందని, కేవలం రూ. 49,499, అలాగే ఇంటెల్ 12వ Gen Core i5, 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజీతో HP పెవిలియన్ ధర కేవలం రూ.53,499 కాగా, ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్, క్యాష్‌బ్యాక్, ప్రోమో కోడ్ తర్వాత దీని ధర రూ. 46,990 మాత్రమేనని తెలిపింది. వాషింగ్ మెషీన్‌లపై కూడా అద్భుతమైన ఆఫర్ ఉందని, దీనిపై రూ. 3,850 విలువైన మిక్సర్ గ్రైండర్‌ను ఉచితంగా పొందవచ్చని తెలిపింది. అలాగే రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై రూ. 7,990 విలువైన స్మార్ట్‌వాచ్‌ని ఉచితంగా పొందవచ్చని తెలిపింది.
రిలయన్స్ డిజిటల్ భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 585+ పెద్ద ఫార్మాట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లు, 1800కిపైగా My Jio స్టోర్‌లతో 800కి పైగా నగరాల్లో ఉందని, దేశంలోని ప్రతి మూలన వినియోగదారులకు సేవలను అందిస్తోందని, సరికొత్త సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిందని రిలయన్స్ తెలిపింది. 300 కంటే ఎక్కువ అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్‌లు, 5000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో ఉత్తమ ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి