Reliance: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌కు చెందిన సోడియమ్-అయాన్ బ్యాటరీ తయారీ సంస్థ ఫారాడియాన్‌ను రిలయన్స్ కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1000 కోట్లు (100 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు). దీంతో పాటు కంపెనీ వృద్దికి అవసరమైన మూలధనానికి, విక్రయాల ప్రారంభాన్ని మరింతగా స్పీడ్ పెంచేందుకు మరో రూ.250 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఒప్పంద పత్రాలపై తమ విభాగమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ సంతకాలు చేసిందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సోడియా-అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అగ్రగామి కంపెనీల్లో ఫారాడియన్ ఒకటి అని బ్యాటరీ సంస్థ సీఈఓ జేమ్స్ క్విన్ తెలిపారు.
బ్యాటరీ టెక్నాలజీ పరంగా భారత్ ముందుండి తోడ్పడుతుందని రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ అన్నారు. ఫారాడియన్ అభివృద్ధి చేసిన సోడియమ్ అయాన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చే బ్యాటరీలు.. సురక్షితంగా ఉంటాయని, వ్యయం కూడా తక్కువేనని తెలిపారు. లిథియమ్-అయాన్, లెడ్-యాసిడ్ బ్యాటరీతో పోలిస్తే సోడియమ్-అయాన్ టెక్నాలజీ బ్యాటరీతో అధిక బెనిఫిట్స్ ఉన్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
గుజరాత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు..
ఈ ఒప్పందంలో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ వద్ద ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కంప్లెక్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన గిగా ఫ్యాక్టరీలో ఫారాడియాన్ సాంకేతికతను రిలయన్స్ ఉపయోగించుకోనుంది.
ఇవి కూడా చదవండి: