AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST collections record: జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు.. ఐదేళ్లలో దాదాపు రెట్టింపు

మన దేశంలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసినప్పుడు, సేవలను పొందినప్పుడు వాటి ధరతో పాటు జీఎస్టీని చెల్లిస్తూ ఉంటాం. దీని ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దేశమంతటా పన్ను రేట్లు, విధానాలు స్థిరంగా ఉంటాయి. దీనిలో వ్యాపారాలను నమోదు చేసుకోవడం వల్ల పన్నుల తగ్గింపు పొందవచ్చు. మన దేశంలో 2017 జూలై 1 నుంచి జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది. కాగా.. స్థూల జీఎస్టీ వసూళ్లు 2025 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.22.08 లక్షల కోట్లకు చేరాయి. కేవలం ఐదేళ్లలో రెట్టింపు అయ్యాయి.

GST collections record: జీఎస్టీ వసూళ్లలో ఆల్ టైమ్ రికార్డు.. ఐదేళ్లలో దాదాపు రెట్టింపు
Gst
Nikhil
|

Updated on: Jul 01, 2025 | 1:37 PM

Share

భారత ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డు నెలకొల్పాయి. ఏకంగా రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి 2021లో రూ.11.37 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో దాదాపు రెట్టింపు పెరిగాయని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. అలాగే నెలవారీ సేకరణ సగటు 2025 నాటికి రూ.1.84 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది 2022లో రూ.1.51 లక్షల కోట్లు, 2024లో 1.68 లక్షల కోట్లుగా ఉంది.

జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వీరు 2017లో 65 లక్షల మంది ఉండేవారు. ఈ ఎనిమిదేళ్లలో సుమారు 1.51 కోట్లకు పెరిగారు. ఇది కూడా జీఎస్టీ వసూలు రికార్డుకు కారణం. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పన్ను బేస్ క్రమంగా విస్తరించింది. పన్నుల సేకరణలో బలమైన ప్రగతి నెలకొంది. దేశ ఆర్ఠిక వ్యవస్థను బలోపేతం చేసింది. తద్వారా దేశ ప్రగతికి తోడ్పాటునందించింది. జీఎస్టీ వసూలులో ప్రతి ఏటా ప్రగతి నమోదవుతూ క్రమంగా ఆదాయం పెరిగింది. ఇక 2025 ఆర్థిక సంవత్సరానికి 22.08 లక్షల కోట్లకు చేరి వసూల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇవి 2021-22లో రూ.11.37 లక్షల కోట్లు, 2022-23లో రూ.18.08 లక్షల కోట్లు, 2023 – 24లో రూ.20.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే గత ఐదేళ్లలో దాదాపు రెట్టింపు సంఖ్యకు చేరుకున్నాయి. ఇక నెల వారీ వసూళ్లు 2025 ఏప్రిల్ లో రూ.2.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయయి. ఈ తర్వాత మే నెలలో రూ.2.01 లక్షల కోట్లు వచ్చాయి.

పన్నుల ప్రక్రియను సులభతరం చేయడమే జీఎస్టీ ప్రధాన లక్ష్యం. ఇది ఒక రకమైన పరోక్ష పన్ను. దీని ద్వారా వినియోగదారులు చెల్లించడం చాలా సులభతరం కావడంతో పాటు వస్తువులు, సేవల ధరలను స్థిరంగా ఉంటాయి. ఏదైనా ఒక సంస్థ లేదా వ్యక్త జీఎస్టీ చెల్లించకపోతే రూ.పది వేలు, గరిష్టంగా పది శాతం వరకూ జరిమానా విధిస్తారు. కొన్ని రకాల వస్తువులు, సేవలు పొందినప్పుడు దీన్ని నుంచి మినహాయింపు ఉంటుంది. వాటిలో వికలాంగుల ఉపకరణాలు, వ్యవసాయ పనిముట్లు, చేనేత వస్త్రాలు, ఉన్ని, ముడి పట్టు, కూరగాయాలు, పండ్లు, మాంసం, చేపలు, వార్తాపత్రికలు, టీకాలు, నానా జ్యుడీషియల్ స్టాంపులు మొదలైనవి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..