భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వడ్డీ రేట్లపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. బ్యాంకుల రెపోరేటు విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం నుంచి ప్రారంభమైంది. దేశంలో పాలసీ రేట్లలో ఏమైనా మార్పు ఉందా..? లేదా అనేదానిపై మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశాల తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఈ విషయం ఆగస్టు 10 గురువారం రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్ల విషయంపై క్లారిటీ రానుంది. ఆగస్టు 10న, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి (CRR) అలాగే మానిటరింగ్ పాలసీ కమిటి సభ్యుల అభిప్రాయం ప్రకారం బ్యాంక్ రేటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 6.50 శాతం వద్దే ఉంచిందని, ఈసారి కూడా రెపో రేటును మార్చే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును మార్చడం లేదు. అయితే గత కొన్ని రోజులుగా దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితిలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అయితే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచబోతోందని కొందరు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆర్‌బీఐ రెపో రేటులో యథాతథ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించబోతోందని చాలా మంది ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
గత రెండు సార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచింది. దీని కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో ఎటువంటి మార్పు లేకుండా 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 6 సార్లు 2.50 శాతం చొప్పున రిజర్వ్ బ్యాంక్ పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును ఏడాది పొడవునా 2.50 శాతం పెంచుతూ వచ్చింది. అలాగే మొత్తం 6 మానిటరింగ్ పాలసీ కమిటి సమావేశాలలో పెంచడం జరిగింది. ఆ తర్వాత అది 4 శాతం నుంచి 6.50 శాతానికి పెరిగింది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్‌బీఐ రెపో రేటును తారుమారు చేయకుండా 6.50 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి