RBI Rules: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం లాకర్ల కేటాయింపు కోసం శాఖల వారీగా ఖాళీ లాకర్ల జాబితాతో పాటు వెయిట్-లిస్ట్ నిర్వహించాలని అన్ని బ్యాంకులకు సూచించింది. అతేకాకుండా లాకర్ల కేటాయింపులో పారదర్శకతను నిర్ధారించాలని బ్యాంకులను ఆదేశించింది. సవరించిన సూచనలు జనవరి 1, 2022 నుండి అమలులోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ”ఖాతాదారులకు సమాచారం అందించే విధానాలను సులభతరం చేయడానికి, బ్యాంకులు శాఖల వారీగా ఖాళీ లాకర్ల జాబితాను కంప్యూటరీకరిస్తాయి. అలాగే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS) లో వెయిట్-లిస్ట్ లేదా ఆర్బీఐ జారీ చేసిన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఏదైనా ఇతర కంప్యూటరైజ్డ్ సిస్టమ్‌ను బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. లాకర్ల కేటాయింపు అదేవిధంగా లాకర్ల కేటాయింపులో పారదర్శకతను పాటించడం ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం “అని ఆర్బీఐ తెలిపింది.
బ్యాంకులు లాకర్ కేటాయింపు కోసం అన్ని దరఖాస్తులను అంగీకరిస్థాయి. అదేవిధంగా అలాట్మెంట్ కోసం లాకర్‌లు అందుబాటులో లేనట్లయితే, కస్టమర్‌లకు వెయిట్ లిస్ట్ నంబర్‌ను అందిస్తాయని ఆర్బీఐ చెప్పింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, లాకర్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసిన, CDD (కస్టమర్ డ్యూ డిలిజెన్స్) ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్న బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులకు సురక్షిత డిపాజిట్ లాకర్స్/ సేఫ్ కస్టడీ ఆర్టికల్ సౌకర్యాలు కల్పిస్తారు. అంతేకాకుండా బ్యాంకుతో మరే ఇతర బ్యాంకింగ్ సంబంధం లేని కస్టమర్లకు కూడా సురక్షిత డిపాజిట్ లాకర్/సురక్షిత కస్టడీ ఆర్టికల్ సౌకర్యాలు ఇచ్చే అవకాశం ఉంది.
సురక్షిత డిపాజిట్ లాకర్‌లో లాకర్-హైర్/లు చట్టవిరుద్ధమైన లేదా ఏదైనా ప్రమాదకర పదార్థాన్ని ఉంచరాదనే నిబంధనను బ్యాంకులు లాకర్ ఒప్పందంలో చేర్చాలని ఆర్బీఐ పేర్కొంది. “సేఫ్ డిపాజిట్ లాకర్‌లో ఏదైనా కస్టమర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకర పదార్థాన్ని డిపాజిట్ చేసినట్లు బ్యాంక్ అనుమానించినట్లయితే ఆ విధంగా చేసిన కస్టమర్‌పై తగిన చర్యలు తీసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది” అని రిజర్వు బ్యాంకు తెలిపింది.
సురక్షిత డిపాజిట్ లాకర్ల కోసం బ్యాంకులు బోర్డు ఆమోదించిన ఒప్పందాన్ని కలిగి ఉండాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రయోజనం కోసం, ఐబీఐ ద్వారా రూపొందించిన మోడల్ లాకర్ ఒప్పందాన్ని బ్యాంకులు స్వీకరించవచ్చు. ఈ ఒప్పందం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉండాలి. అలాగే, లాకర్ ఒప్పందాల్లో ఏవిధమైన అన్యాయమైన నిబంధనలు, శరట్లు ఉండకుండా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో జనవరి 1, 2023 నాటికి బ్యాంకులు తమ లాకర్ ఒప్పందాలను ఇప్పటికే ఉన్న లాకర్ కస్టమర్లతో పునరుద్ధరించాల్సి ఉంటుంది.
కస్టమర్ మరణించినట్లయితే క్లెయిమ్‌ల పరిష్కారం ఇలా..
క్లెయిమ్‌ల పరిష్కారానికి బ్యాంకులు బోర్డు ఆమోదించిన విధానాన్ని కలిగి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. నామినీకి, ఇతర వ్యక్తుల క్లెయిమ్‌ల నోటీసు నుండి రక్షణ కోసం భద్రతా లాకర్స్/సేఫ్ కస్టడీ ఆర్టికల్‌లోని కంటెంట్‌లను నామినేట్ చేయడానికి, విడుదల చేయడానికి పాలసీని రూపొందించాలని కూడా రిజర్వు బ్యాంక్ కోరింది. అదేవిధంగా బ్యాంకులు త్వరగా క్లెయిమ్స్ పరిష్కరించాల్సి ఉంటుంది. డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రానికి లోబడి క్లెయిమ్ అందుకున్న తేదీ నుండి 15 రోజులకు మించని వ్యవధిలో లాకర్‌లోని విషయాలను నామినీలకు బ్యాంకులు విడుదల చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఇన్నాళ్లూ బ్యాంక్ లాకర్ల విషయంలో బ్యాంకులు తమ ఇష్టానికి పనిచేసేవి. ఏ బ్యాంకుకు ఆబ్యాంక్ తన సొంత నియమావళితో ముందుకు వెళ్ళేవి. అయితే, లాకర్ల విధానాన్ని పారదర్శకం చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ విధానాన్ని అమలు చేయాలంటూ సూచించింది.
Also Read: JioPhone Next: జియోఫోన్ నెక్స్ట్ త్వరలో మార్కెట్ లోకి వచ్చేస్తోంది.. దీని ధర ఎంతో తెలుసా?
Business Idea: తక్కువ పెట్టుబడితో గౌరవమైన ఉపాధి..అత్యధిక ఆదాయం కావాలా? అయితే, ఇది మీకోసమే!