
RBI: దేశంలోని అన్ని బ్యాంకుల కార్యకలాపాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పర్యవేక్షిస్తుంది. ఒక బ్యాంకు నిబంధనలను ఉల్లంఘించి, ఏకపక్షంగా వ్యవహరించినప్పుడల్లా ఆర్బీఐ జరిమానాలు విధించవచ్చు. ఈ సందర్భంలో నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా విధించింది.
బ్యాంకింగ్ సేవలను పొందడం, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (BSBD), బిజినెస్ కరస్పాండెంట్ (BC) పాత్ర, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరో (CIC)కి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 47A(1)(c) సెక్షన్ 46(4)(i)తో, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (నియంత్రణ) చట్టం, 2005లోని సెక్షన్ 23(4)తో చదివిన సెక్షన్ 25(1)(iii) కింద RBIకి ఉన్న అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించినట్లు సెంట్రల్ బ్యాంకు తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా? తాజా రేట్ల వివరాలు!
ఈ విషయంపై ఆర్‌బిఐ బ్యాంకుకు నోటీసు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ప్రతిస్పందన తర్వాత బ్యాంకులో ఇప్పటికే బిఎస్‌బిడి ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్ల కోసం బ్యాంక్ అదనపు బిఎస్‌బిడి ఖాతాలను తెరిచినట్లు ఆర్‌బిఐ కనుగొంది. ఇంకా బిసి అనుమతించిన కార్యకలాపాల పరిధిలో లేని కార్యకలాపాలను నిర్వహించడానికి బ్యాంక్ బిసితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి బ్యాంకు సిఐసికి తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆర్‌బిఐ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Success Story: చదివింది 8.. చిన్న కిరాణా షాపుతో ప్రారంభించి నేడు రూ.8000 కోట్లకు.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో నివాసం!
ఈ చర్య కేవలం నిబంధనల ఉల్లంఘనల ఆధారంగానే తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ చర్య చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతిలో లోపాల ఆధారంగా తీసుకున్నట్లు, బ్యాంకు తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏవైనా లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటుపై వ్యాఖ్యానించడానికి ఉద్దేశించిలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కస్టమర్ల డబ్బును ప్రభావితం చేయదని ఆర్బీఐ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి