RBI Penalty: ఈ 9 బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ చర్యలు.. 12 లక్షల వరకు జరిమానా

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచుతుంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది...

RBI Penalty: ఈ 9 బ్యాంకులపై ఆర్‌బీఐ భారీ చర్యలు.. 12 లక్షల వరకు జరిమానా
RBI

Updated on: Nov 15, 2022 | 9:32 AM

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఎల్లప్పుడూ ఒక కన్ను వేసి ఉంచుతుంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝులిపిస్తోంది. ఆ బ్యాంకుపై వెంటనే చర్య తీసుకుంటోంది. ఈసారి 9 బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. వివిధ బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను 9 సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు రూ.12 లక్షల వరకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన ప్రత్యేక ప్రకటనల్లో పేర్కొంది

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెర్హంపూర్ సహకరి అర్బన్ బ్యాంక్ (ఒడిశా)పై రూ. 3.10 లక్షలు, మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జనతా సహకరి బ్యాంక్‌పై రూ. 2.5 లక్షలు, గుజరాత్‌లోని శాంత్రంపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 2 లక్షలు జరిమానా విధించింది. ఇది కాకుండా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మర్యాడిట్, మధ్యప్రదేశ్, జంషెడ్‌పూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జార్ఖండ్ మరియు రేణుకా నాగ్రిక్ సహకరి బ్యాంక్, ఛత్తీస్‌గఢ్‌లు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది.

దీనితో పాటు, మధ్యప్రదేశ్‌లోని కృష్ణా మర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఒడిశాలోని కేంద్రపారా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా విధించబడింది. దీంతో పాటు గుజరాత్‌లోని నవనగర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.25,000 జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ లైసెన్స్ రద్దు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ దేశంలోని ప్రభుత్వం, ప్రభుత్వేతర బ్యాంకులపై నిఘా ఉంచుతుంది. నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ లైసెన్స్‌ రద్దుతో పాటు భారీ ఎత్తున పెనాల్టీ విధిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ బాబాజీ డేట్ మహిళా సహకరి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us