
హోమ్ లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఆర్బీఐ డ్రాఫ్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఫ్లోటింగ్ వడ్డీ రేట్లకు సంబంధించి కొత్త రూల్స్‌ను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ రెపో రేటు ఆధారంగా వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు దీనిని తమ కస్టమర్లకు బదిలీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. కొన్నిసార్లు ఏడాది వరకు సమయం తీసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను మార్చడం లేదు. దీని వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా ఖాతాదారులు ప్రయోజనం పొందలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ఆర్బీఐ.. లోన్లు తీసుకునేవారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు అమలు చేయడానికి సంబంధించి కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది.
హోమ్ లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ శుభవార్త అందించింది. హోమ్ లోన్ల వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ రేటు వడ్డీతో లింక్ అయి ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా ఫ్లోటింగ్ రేటు వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉంటుంది. కానీ చాలా బ్యాంకులు సవరించేందుకు చాలా ఆలస్యం చేయడం వల్ల కస్టమర్లకు నష్టం జరుగుతుంది. ఈ సమస్యను గుర్తించిన ఆర్బీఐ.. రుణగ్రహీతలకు లాభం జరిగే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇక నుంచి ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న 3 నెలలకే బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీఐ పరిమితులు విధించింది. వేగంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డ్రాప్ట్ రూల్స్ విడుదల చేయగా.. దీనిపై బ్యాంకులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆర్బీఐ అభిప్రాయాలు స్వీకరిస్తోంది. సెప్టెంబర్ 11లోపు అభిప్రాయాలు తెలపాలని సూచించింది. అనంతరం దీనిని అనుగుణంగా ఏమైనా మార్పులు చేసి 2027 ఏప్రిల్ నుంచి అమలు చేస్తారు.
అయితే ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచినా కూడా ఇదే నిర్ణయం వర్తిస్తుంది. అయితే కేవలం ఫ్లోటింగ్ రేట్ రుణాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. పర్సనల్ లోన్లు, వెహికల్ లోన్లు వంటివి స్థిర వడ్డీ రేటును కూడి ఉంటాయి. దీంతో పర్సనల్ లోన్లు, ఇతర లోన్లపై ఈ నిర్ణయాల ప్రభావం ఉండవు. హోమ్ లోన్లు ఎక్కువగా ఫ్లోటింగ్ రేటుతో అనుసంధానించబడి ఉంటాయి. దీని వల్ల హోమ్ లోన్లు తీసుకున్నవారికి ఊరటగా చెప్పవచ్చు. కానీ ఈ ప్రయోజనాలు పొందాలంటే వచ్చే నెల వరకు వేచి చూడాల్సి ఉంటుంది.