RBI: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. సామాన్యుడికి మరింత మేలు

RBI: ఇప్పుడు ఏటీఎంలలో ఎక్కువగా 500 రూపాయల నోట్లు కాకుండా 100,200 రూపాయల నోట్లే ఎక్కువగా వస్తున్నాయి. ఇది వరకు పెద్ద నోట్లు ఎక్కువగా వచ్చేవి. దీంతో సామాన్యులకు ఈ 500 నోట్లతో ఇబ్బందులు పడేవారు. కానీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

RBI: 100, 200 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక అప్‌డేట్‌.. సామాన్యుడికి మరింత మేలు

Updated on: Jun 17, 2025 | 2:58 PM

భారత కరెన్సీల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దేశంలోని 73 శాతం ఏటీఎంలలో100-200 రూపాయల నోట్లు ఉంటున్నాయి. సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకున్న తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏటీఎంల నుండి 100, 200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచడానికి 2025 సెప్టెంబర్ 30న మార్గదర్శకాన్ని ఇచ్చింది. దేశంలోని ఏటీఎంలలో 75 శాతం వరకు 100, 200 రూపాయల నోట్లను ఉంచాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచింది. అయితే ఇది వరకు ఏటీఎంలలో ఎక్కువగా 500 రూపాయల నోట్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డీఐ ఆదేశాల తర్వాత ఎక్కువ శాతం 100,200 రూపాయల నోట్లు ఉంటున్నాయి. 500 రూపాయల నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.

ఇది కూడా చదవండి: Post Office: రోజుకు రూ.333 డిపాజిట్ చేస్తే చేతికి రూ.17 లక్షలు.. అద్భుతమైన స్కీమ్

దేశంలోని 215,000 ఏటీఎంలలో 73,000 నిర్వహిస్తున్న భారతదేశపు అతిపెద్ద నగదు నిర్వహణ సంస్థ అయిన CMS ఇన్ఫో సిస్టమ్స్ ప్రకారం, ఇది డిసెంబర్ 2024లో 65 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, CMS ఇన్ఫో సిస్టమ్స్ క్యాష్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ అనుష్ రాఘవన్ మాట్లాడుతూ.. వినియోగదారుల ఖర్చులో 60 శాతం ఇప్పటికీ నగదుపై ఆధారపడి ఉండటంతో, ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలలో రూ. 100, రూ. 200 నోట్ల లభ్యత రోజువారీ లావాదేవీ అవసరాలను నేరుగా తీరుస్తోందని అన్నారు.

ఇది కూడా చదవండి: Health Tips: పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

ఇది కూడా చదవండి: DoT New Rule: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నెట్‌వర్క్‌ మారాలంటే 90 రోజులు కాదు.. 30 రోజులే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి