ఆర్‌బిఐ తన డిజిటల్ కరెన్సీ (సిబిడిసి) పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న విడుదల చేయనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఎంచుకున్న ప్రదేశాలలో కస్టమర్‌లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ-రూపాయి డిజిటల్ టోకెన్‌గా పని చేస్తుంది. కరెన్సీ నోట్లు, నాణేలు పని చేసే విధంగానే డిజిటల్ కరెన్సీ పని చేస్తుంది. ఇది వివిధ డినామినేషన్ల కరెన్సీకి సమానమైన విలువలో అందుబాటులో ఉంటుంది. అది బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది.
మొబైల్ ఫోన్లు లేదా ఇతర పరికరాల్లో నిల్వ చేసిన బ్యాంకుల డిజిటల్ వాలెట్ల నుంచి వినియోగదారులు డిజిటల్ రూపాయిల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ఈఐ) తెలిపింది. ఈ లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తికి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, వ్యక్తి నుండి వ్యాపారి అంటే ఒక వ్యక్తి, వ్యాపారి మధ్య చేసుకునే సదుపాయం ఉంటుంది. వ్యాపారి ఉన్న ప్రదేశంలో ప్రదర్శించబడే క్యూఆర్ కోడ్‌ల ద్వారా వ్యాపారికి అంటే దుకాణదారునికి చెల్లింపు చేయవచ్చు.
డిజిటల్ రూపాయి లావాదేవీలు వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి పంపుకోవచ్చు. అంతేకాకుండా షాపుల్లో ఉంచిన QR కోడ్‌లను ఉపయోగించి దుకాణదారునికి కూడా చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రజలంతా తమ బ్యాంకులు అందించే డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేయవచ్చు. డబ్బు మార్పిడికి సులభమైన మార్గంగా చెప్పవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఇక నగదు విషయానికొస్తే.. డిజిటల్ రూపాయి ఎలాంటి వడ్డీని పొందలేరు. కానీ బ్యాంకుల్లో డిపాజిట్లు వంటి ఇతర రకాల నగదుకు మార్చుకోవచ్చు. డిజిటల్ రూపాయి భౌతిక నగదు ఫీచర్లను కూడా అందిస్తుంది.
ఈ డిజిటల్ రూపాయి ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌తో సహా నాలుగు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, హువాజాతి, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా వంటి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులు తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి