Akasa Air: భారత స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ అయిన రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన విమానయాన సంస్థ ఆకాశ. ఈ సంస్థ తక్కువ ఖర్చుకే విమానయానాన్ని దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు విమానయాన రంగంలోకి ప్రవేశించింది. ఈ కంపెనీ విమానాలు అతి త్వరలోనే టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమౌతున్నాయి. తమ కమర్షియల్ సేవలను కంపెనీ అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే సేవలను అందించేందుకు వినియోగించే విమానాలకు సంబంధించి ఎంపిక చేసిన విమాన ఫోటోను కంపెనీ ఈ రోజు షేర్ చేసింది. ఈ ఫోటో క్యాప్షన్ ‘శాంతంగా ఉండలేకపోతున్నాను! మా QP-Pieకి హలో చెప్పండి!’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కంపెనీ సేవలను ప్రారంభించేందుకు రాకేష్ జున్‌జున్‌వాలా దాదాపు రూ.262 కోట్లను పెట్టుబడిగా పెట్టారు.
తమ విమానయాన కంపెనీకి సంబంధించిన లోగోను గతేడాది లాంచ్ చేయగా.. ఎయిర్‌లైన్ తన లోగో కోసం ‘సన్‌రైజ్ ఆరెంజ్’ అండ్ ‘పాషనేట్ పర్పుల్’ రంగులను ఎంచుకుంది. ఇది వేడి, శక్తిని సూచిస్తుంది. టైర్ -2, టైర్ -3 నగరాల నుంచి విమానాలను ప్రారంభించి ప్రజలకు సేవలను అందించేందుకు తాము చాలా సంతోషంగా ఉన్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ప్రారంభ దశలో ఆకాశ విమాన సేవలు మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాలకు మధ్య మాత్రమే ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా.. మెట్రోల మధ్య కూడా విమానాలు నడపబడతాయి. కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి 12 నెలల్లో 18 విమానాలతో తన సేవలను విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. ఆ తరువాత ఎయిర్ లైన్ కంపెనీ ప్రతి సంవత్సరం 12 నుంచి 14 కొత్త విమానాలను అదనంగా జోడించాలని ప్రణాళికగా పెట్టుకుంది.
Can’t keep calm! Say hi to our QP-pie! ?#AvGeek pic.twitter.com/sT8YkxcDCV
— Akasa Air (@AkasaAir) May 23, 2022