రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఆ విషయం 10 గంటల ముందే తెలుస్తుంది.. రైల్వే శాఖ అధికారిక ప్రకటన

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైలు టిక్కెట్ల ధృవీకరణ వివరాలు, తొలి రిజర్వేషన్ చార్ట్ రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే విడుదల అవుతుంది. ప్రయాణికులు చివరి నిమిషంలో ఆందోళన చెందకుండా, తమ సీటు లేదా బెర్త్ ఖరారైందా లేదా అని ముందుగానే తెలుస్తుంది.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! ఆ విషయం 10 గంటల ముందే తెలుస్తుంది.. రైల్వే శాఖ అధికారిక ప్రకటన
Train

Updated on: Dec 20, 2025 | 9:13 PM

ఎక్కడికైనా దూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే చాలా మంది చేసే పని రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకోవడం. కొంతమంది రెండు మూడు రోజుల ముందే టిక్కెట్లు బుక్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే అప్పటికే ఆ రైలు టిక్కెట్లు అయిపోయి ఉంటే, వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటారు. అలా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నవారికి సీట్లు బుక్‌ అయ్యాయా లేదా అనేది రైలు బయలుదేరే సమయానికంటే 10 గంటల ముందే తెలిసిపోతుంది. ప్రయాణికుల రిజర్వేషన్‌ వివరాలతో కూడిన తొలి జాబితాలను రైలు బయల్దేరే సమయానికంటే 10 గంటల ముందే సిద్ధం చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దూర ప్రాంతాల నుంచి వేరే స్టేషన్లకు వెళ్లి రైలును అందుకోవాల్సినవారికి తమ బెర్తు, సీటు ఖాయమైందో లేదో స్పష్టంగా తెలిస్తే చివరిక్షణంలో హైరానా పడాల్సిన పనిలేకుండా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున 5.01 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందురోజు రాత్రే రూపొందిస్తారు. మధ్యాహ్నం 2.01 గంటల నుంచి రాత్రి 11.59 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య బయల్దేరే రైళ్ల తొలిచార్టును ఇదే విధంగా తగినంత ముందుగా రెడీ చేస్తారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జోనల్‌ కార్యాలయాలకు రైల్వే మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి