
భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు చాలా తక్కువ ఛార్జీలకు ప్రయాణాన్ని అందిస్తాయి. చౌక టిక్కెట్లు, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా భారతదేశంలో రైళ్లు ఒక ప్రసిద్ధ రవాణా సాధనం. కానీ భారతీయ రైల్వేలు చౌక ప్రయాణాన్ని అందించడమే కాకుండా చౌకైన బీమాను కూడా అందిస్తాయని మీకు తెలుసా? మీరు కేవలం 45 పైసల ప్రీమియంతో రైల్వే ప్రయాణ బీమాను పొందవచ్చు. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు ఎదుర్కొన్న నష్టాన్ని రైల్వే ప్రయాణ బీమా భర్తీ చేస్తుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినట్లయితే రూ. 10 లక్షల బీమా మొత్తం అందిస్తుంది. దీనితో పాటు గాయం విషయంలో కూడా క్లెయిమ్ అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: Sundar Pichai Salary: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!
భారతీయ రైల్వేలు అందించే ప్రయాణ బీమా పథకం ఒక ఐచ్ఛిక బీమా పథకం. ఇది IRCTC యాప్ లేదా పోర్టల్ ద్వారా ఇ-టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. టికెట్ కౌంటర్ నుండి టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పుడు రైల్వే ప్రయాణ బీమా అందుబాటులో ఉండదు. అలాగే జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సౌకర్యం లభించదు.
ఇది కూడా చదవండి: Credit Card: ఈ ఐదు తప్పులు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి.. అవేంటో తెలుసా?
ఆన్‌లైన్ రైల్వే టికెట్ బుకింగ్ పూర్తయినప్పుడు వెబ్‌సైట్, యాప్‌లో రైల్వే ప్రయాణ బీమా ఎంపిక కనిపిస్తుంది. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు బీమా ఎంపికను ఎంచుకోండి. మీకు బీమా కోసం 45 పైసలు మాత్రమే వసూలు చేస్తుంది రైల్వే. బీమా ఎంపికను ఎంచుకున్నప్పుడు మీ ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌కు లింక్ వస్తుంది. ఈ లింక్ బీమా కంపెనీకి చెందినది. ఈ లింక్‌కి వెళ్లడం ద్వారా అక్కడ నామినీ వివరాలను పూరించండి. బీమా పాలసీలో నామినీ ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం.
రైల్వే ప్రయాణ బీమా దేనిని కవర్ చేస్తుంది?
రైల్వే ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే బీమా మొత్తం రూ. 10 లక్షలు. ప్రమాదంలో ప్రయాణికుడు పూర్తిగా అంగవైకల్యానికి గురైతే కంపెనీ అతనికి రూ. 10 లక్షలు ఇస్తుంది. శాశ్వత వైకల్యం సంభవిస్తే బీమా మొత్తం రూ. 7.5 లక్షలు. గాయపడితే వైద్య ఖర్చుల కోసం రూ. 2 లక్షలు ఇస్తారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి రూ. 10,000 వరకు ఇస్తారు. ప్రయాణం ప్రారంభం నుండి గమ్యస్థాన స్టేషన్ చేరుకునే వరకు కవరేజ్ చెల్లుతుంది. ఇందులో రైలు ఎక్కే, దిగే సమయం కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: మీరు మొదటి సారిగా ప్రైవేట్ ఉద్యోగంలో చేరారా? కేంద్రం నుంచి రూ.15 వేలు!
రైల్వే ప్రయాణ బీమాను ఎవరు తీసుకోవచ్చు?
ఈ పథకాన్ని భారత పౌరులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ధృవీకరించిన లేదా RAC టిక్కెట్లు కలిగి ఉన్నవారు మాత్రమే రైల్వే ప్రయాణ బీమాను పొందగలరు. జనరల్ కోచ్‌లలో ప్రయాణించేవారు కూడా అర్హులు కారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, విదేశీయులు రైల్వే బీమాను పొందలేరు.
రైల్వే ప్రయాణ బీమా ఎప్పుడు లభిస్తుంది?
రైలు ప్రమాదాలు (పట్టాలు తప్పడం, ఢీకొనడం వంటివి), రైల్వే చట్టం, 1989లోని సెక్షన్ 123, 124, 124Aలో అవాంఛనీయ సంఘటనలు అంటే దోపిడీ, ఉగ్రవాద దాడి, అల్లర్లు లేదా రైలు నుండి పడిపోవడం మొదలైన సందర్భాల్లో రైల్వే ప్రయాణ బీమాను క్లెయిమ్ చేయవచ్చు. ఇది వ్యక్తిగత ప్రమాదాలు (ఆత్మహత్య వంటివి) లేదా సామాను కోల్పోవడం వంటివి కవర్ చేయదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి