AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horse Power: వాహనాలలో హార్స్‌ పవర్‌ అంటే ఏంటి? ఈ పదాన్ని గుర్రాలతో ఎందుకు పోల్చారు.. ఆసక్తికర అంశాలు!

Horse Power: ఒక వాహనం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఆ వాహనం ఎన్ని గుర్రాల శక్తికి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుందో సూచించడానికి "హార్స్ పవర్" అనే పదం ఉపయోగిస్తున్నారు. అతని కొత్తగా రూపొందించిన ఆవిరి యంత్రం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించింది. అయితే..

Horse Power: వాహనాలలో హార్స్‌ పవర్‌ అంటే ఏంటి? ఈ పదాన్ని గుర్రాలతో ఎందుకు పోల్చారు.. ఆసక్తికర అంశాలు!
Subhash Goud
|

Updated on: Aug 17, 2025 | 1:19 PM

Share

Horse Power: “హార్స్ పవర్” అనే పదం వాహనాల శక్తిని కొలవడానికి ఎలా వచ్చింది . అవిరి యంత్రాల అభివృద్ధి సమయంలో జేమ్స్ వాట్ అనే శాస్త్రవేత్త ఆవిరి యంత్రాల శక్తిని అప్పటికే వాడుకలో ఉన్న గుర్రాల శక్తితో పోల్చి చూశారు. ఆవిరి యంత్రాలు గుర్రాల కంటే ఎంత శక్తివంతమైనవో వివరించడానికి “హార్స్ పవర్” అనే పదాన్ని ఉపయోగించారు. జేమ్స్ వాట్ తన ఆవిరి యంత్రాల శక్తిని కొలవడానికి ఒక గుర్రం ఒక నిర్దిష్ట పనిని ఎంత వేగంగా చేయగలదో లెక్కించారు. అతనికి రెండు గుర్రాలు ఉండేవి. ఆ లెక్కల ఆధారంగా ఒక హార్స్ పవర్ అంటే ఒక గుర్రం ఒక నిమిషంలో 33,000 పౌండ్ల బరువును ఒక అడుగు ఎత్తుకు ఎత్తడానికి సరిపడా శక్తి అని నిర్ణయించారు. ఈ పద్ధతి అప్పటి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండటం వలన హార్స్ పవర్ అనే పదం ప్రాచుర్యం పొందింది.

ఇది కూడా చదవండి: AC Side Effects: మీరు ఏసీలో ఎక్కువ సేపు ఉంటున్నారా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

అంటే ఒక వాహనం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఆ వాహనం ఎన్ని గుర్రాల శక్తికి సమానమైన శక్తిని ఉత్పత్తి చేస్తుందో సూచించడానికి “హార్స్ పవర్” అనే పదం ఉపయోగిస్తున్నారు. అతని కొత్తగా రూపొందించిన ఆవిరి యంత్రం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించింది. అయితే సాంప్రదాయ గుర్రపు బండిని దాటి వెళ్లే సమయంలో అతను హార్స్ పవర్ ప్రమాణాన్ని సెట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Sundar Pichai Salary: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు!

దీని కోసం జేమ్స్‌ ఒక ప్రయోగాన్ని నిర్వహించాడు. దీనిలో గుర్రాన్ని తాడుతో కట్టి ఆపై ఒక గిలక ద్వారా దానికి ఒక బరువును జోడించారు. గుర్రం 1 సెకనులో 1 అడుగు బరువును ఎత్తినప్పుడు ప్రమాణాన్ని సెట్ చేయడానికి ఒక మార్గం కనుగొన్నాడు. 1 హార్స్‌పవర్ అంటే ఒక సెకనులో ఒక అడుగు 550 పౌండ్ల బరువును ఎత్తగల సామర్థ్యాన్ని అతను లెక్కల ద్వారా నిర్ణయించాడు. సాధారణ భాషలో 1 నిమిషంలో 33 వేల పౌండ్లను అడుగు వరకు ఎత్తే సామర్థ్యాన్ని ఒక హార్స్‌పవర్ అంటారు.

Horse Power1

గుర్రానికి ఎంత హార్స్‌పవర్‌ ఉంటుంది?

జేమ్స్ వాట్ ప్రకారం.. 1 హార్స్‌పవర్ అనేది గుర్రం చాలా కాలం పాటు నిర్వహించగల శక్తి. ఈ లెక్కన 1 గుర్రానికి 14.9 హార్స్ పవర్ ఉన్నట్టు చెబుతున్నారు. వాహనాల్లో హార్స్ పవర్ అంటే ఇంజిన్ ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుందోనని. చిన్న కార్లు 120 హార్స్‌పవర్‌లను ఉత్పత్తి చేయగలవు. అయితే పెద్ద కార్లు లేదా ట్రక్కులు 200 హార్స్‌పవర్ లేదా అంతకంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవు.

ఇది కూడా చదవండి: మీరు మొదటి సారిగా ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరారా? కేంద్రం నుంచి రూ.15 వేలు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా