Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? టికెట్‌ ఉన్నా జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?

|

Jun 23, 2024 | 7:55 PM

భారతీయ రైల్వేలో అనేక నిబంధనలున్నాయి. ఒక వేళ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే జరిమానాలతో పాటు జైలు శిక్ష పడవచ్చు. ఉదాహరణకు, మీరు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారనుకుందాం.. మీరు పట్టుబడితే రైల్వే జరిమానా వసూలు చేస్తుంది. కొన్ని నిబంధనల ప్రకారం జైలు శిక్ష విధిస్తారు. అలాగే రైలులో ఎలాంటి వస్తువులను ఎక్కించాలనే నిబంధనలను

Indian Railways: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా? టికెట్‌ ఉన్నా జరిమానా చెల్లించాల్సిందే.. ఎందుకో తెలుసా?
Indian Railways
Follow us on

భారతీయ రైల్వేలో అనేక నిబంధనలున్నాయి. ఒక వేళ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే జరిమానాలతో పాటు జైలు శిక్ష పడవచ్చు. ఉదాహరణకు, మీరు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారనుకుందాం.. మీరు పట్టుబడితే రైల్వే జరిమానా వసూలు చేస్తుంది. కొన్ని నిబంధనల ప్రకారం జైలు శిక్ష విధిస్తారు. అలాగే రైలులో ఎలాంటి వస్తువులను ఎక్కించాలనే నిబంధనలను కూడా రైల్వేశాఖ ఖరారు చేసింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు, ఏదైనా సందర్భంలో నిబంధనలు పాటించకపోతే టిక్కెట్ తీసుకున్న తర్వాత కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

భారతీయ రైల్వే పరిధి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ రైల్వేలలో ప్రతిరోజూ ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు దాదాపు సమానంగా ఉంటుందని అంచనా. 700 స్టేషన్లలో మొత్తం 22000 రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లన్నింటిలో టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా చెల్లించాల్సిందే. అయితే, మీ వద్ద టికెట్ ఉన్నప్పటికీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Petrol Price: త్వరలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.20 వరకు తగ్గనుందా? కేంద్రం ప్రతిపాదన ఏంటి?

పురుషులు రైలు ప్రయాణం చేసేటప్పుడు టిక్కెట్ తీసుకుని మహిళలకు కేటాయించిన సీట్లలో ప్రయాణించడం తరచూ చూస్తుంటాము. ఇది రైల్వే నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లే. రైల్వే చట్టం ప్రకారం.. ఇది నేరం. ఈ కేసులో రైల్వే చట్టంలోని సెక్షన్ 162 ప్రకారం శిక్ష విధిస్తారు. అధిక సంఖ్యలో ప్రయాణికుల మధ్య ఎవరు ఏ గదిలో ప్రయాణిస్తున్నారో కనిపెట్టడం సాధ్యం కాదు. అయితే పట్టుబడితే మినహాయింపు ఉండదు. జరిమానా విధిస్తారు.

ఇది కూడా చదవండి: USB Socket: అడాప్టర్‌ అవసరం లేకుండానే ఫోన్‌ ఛార్జింగ్‌ చేయవచ్చు.. ఈ సాకెట్‌తో ఎన్ని మొబైల్స్‌ అయినా ఒకేసారి ఛార్జ్‌