Multibagger Returns: బంగారం లాంటి లాభాలను అందించిన జ్యూవెలరీ కంపెనీ.. లక్షను.. రూ.12 లక్షలు చేసింది..

|

Apr 28, 2022 | 9:29 PM

Multibagger Returns:  గడచిన ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు మంచి రాబడులను అందించాయి. ఇదే సమయంలో వందల షేర్లు మల్టీ బ్యాగర్లుగా మారాయి.

Multibagger Returns: బంగారం లాంటి లాభాలను అందించిన జ్యూవెలరీ కంపెనీ.. లక్షను.. రూ.12 లక్షలు చేసింది..
stock market
Follow us on

Multibagger Returns:  గడచిన ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో చాలా కంపెనీల షేర్లు మంచి రాబడులను అందించాయి. ఇదే సమయంలో వందల షేర్లు మల్టీ బ్యాగర్లుగా మారాయి. వీటిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ఊహించని రీతిలో లాభాలను గడించారు. పెట్టుబడి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరూ మల్టీబ్యాగర్ స్టాక్ కోసం వెతుకుతుంటారు. కానీ వాటిని గుర్తించటంలో అనేక మంది విఫలమౌతుంటారు. అలాంటి కోవకు చెందినదే Radhika Jeweltech స్టాక్. ఆభరణాల తయారీలో ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ షేర్ ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించింది. ఈ కంపెనీ షేర్ 28న స్టాక్ మార్కెట్లో 1.26 శాతం మేర లాభపడి రూ. 197.30 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఏడాది కాలంలో 1111 శాతానికి పైగా లాభాలను ఈ రాధిక జ్యూవెల్‌టెక్ తన పెట్టుబడి దారులకు అందించింది. గత సంవత్సరం ఏప్రిల్ 28న ఈ షేర్ విలువ రూ. 16గా ఉంది. ఆరు నెలల కాలానికి చూసుకుంటే 125 శాతం రాబడిని ఈ కంపెనీ ఇచ్చింది. గత నెలలో షేరు 32 శాతం లాభపడింది. ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు షేర్ 46.71 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది. ఈ కంపెనీకి పోటీదారులైన టైటాన్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, కళ్యాణ్ జ్యూ వెలర్స్ కంటే రాధికా జ్యూవెలర్స్ మెరుగైన పనితీరును కనబరిచింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ షేర్ విలువ ఏడాదిలో 19.67 శాతం మాత్రమే పెరిగింది. రాధిక జ్యూవెల్‌టెక్ కంపెనీలో ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ 12 లక్షలకు పైగానే ఉండేది. ఆరు నెలల కాలంలో దాని విలువ 2.25 లక్షల రూపాయలకు పైగా ఉండేది.

NOTE: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Infosys News: ఇన్ఫోసిస్ కు తిప్పలు తెచ్చిన కొత్త నిబంధనలు.. మరోపక్క వేలల్లో ఉద్యోగుల రాజీనామాలు..

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!