Pure EV: అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో ప్రమాదం పొంచివుంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన పలు ఎలక్ట్రిక్ వాహనాలలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీ పేలుడు, ఇతర సమస్యలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చెన్నై, ఇతర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల్లో పేలుడు సంభవించగా, ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఫ్యూర్ కంపెనికి చెందిన స్కూటర్ బ్యాటరీ పేలుడు సంభవించింది. నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) బ్యాటరీని చార్జింగ్ పెట్టగా, ఒక్కసారిగా పేలడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్యూర్ (Pure) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీకి చెందిన ETrance Plus, EPluto 7G మోడల్‌కు చెందిన 2,000 వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. వెనక్కి రప్పించే వాహనాలలో బ్యాటరీకి సంబంధించిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. పేలుడుకు గల కారణాలను తెలుసుకుని చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ప్యూర్ ఎలక్ట్రిక్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. కంపెనీ డీలర్‌షిప్ ద్వారా కస్టమర్లకు సమాచారం అందించి వాహనాలను రీకాల్ చేయనున్నట్లు తెలిపింది.
కాగా,నిజామాబాద్ లో ఇంట్లో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ఎస్‌బీఐ బ్యాంక్ ప్రాంతంలో నివాసం ఉండే కళ్యాణ్ రోజులాగే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని హాలులో చార్జింగ్ పెట్టాడు. అనంతరం తాత రామస్వామి(80), నాన్నమ్మ కమలమ్మతో కలిసి అదే హాల్‌లో పడుకున్నాడు. మరో గదిలో రామస్వామి కుమారుడు ప్రకాశ్, కోడలు కృష్ణవేణి పడుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున బ్యాటరీ భారీ శబ్ధంతో పేలిపోయింది. శబ్ధానికి గదిలో నిద్రిస్తున్న ప్రకాశ్, కృష్ణవేణి బయటికు పరుగులు పెట్టారు. అంతలోనే బ్యాటరీలోని కెమికల్ హాల్‌లో వ్యాపించి దాని ద్వారా మంటలు రామస్వామి, కమలమ్మ, కళ్యాణ్‌కు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కృష్ణవేణికి సైతం గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రామస్వామిని ఆయన కుమారుడు ప్రకాష్ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
— PURE EV (@pureevindia) April 21, 2022
ఇవి కూడా చదవండి: