Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

|

Apr 05, 2021 | 12:52 PM

Electric Bike: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతండటంతో చాలా మంది..

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌
Electric Bike
Follow us on

Electric Bike: దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రోజురోజుకు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతండటంతో చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్లుగా పలు స్టార్ట్‌ఆఫ్‌ కంపెనీలు కూడా వినూత్నంగా ఆలోచిస్తూ ఎలక్ట్రికల్‌ బైక్‌లను అందుబాటులోకి తీసుకుందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు రకల ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులో ఉన్న అవి మరి కాస్త సాన్యుల వరకు అందడం లేదు. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన ప్యూర్‌ ఈవీ (Puer EV) అనే సంస్థ హైస్పీడ్‌ మోటారు బైకులు రూపొందించింది. కేవలం ఒకసారి చార్జీంగ్‌ చేస్తే దాదాపు 116 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా తయారు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం ఒకసారి చార్జీంగ్‌ చేయడం కోసం మనకు అయ్యే పవర్‌ ఖర్చు కూడా చాలా తక్కువే. ఒకసారి చార్జీంగ్‌ చేస్తే 17 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. కేవలం ఐదు సెకన్లలోనే దాదాపు 40 కిలోమీటర్ల స్పీడ్‌ను ఈ బైక్‌ అందుకోగలదు. దీంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 116 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటున్నారు. రిగ్యూల‌ర్ బైక్ లు వెళ్లే స్పీడ్ ఈ బైక్ వెళ్లుతుంది. 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ వ‌చ్చే ఈ బైక్ ఫుల్ చార్జ్ చేయ‌డానికి నాలుగు గంట‌లు ప‌డుతుంది. ఫుల్ చేస్తే కేవ‌లం 2.5 ప‌వ‌ర్ యూనిట్లు మాత్రమే ఖ‌ర్చు అవుతాయ‌ని సంస్థ యాజ‌మానులు చెబుతున్నారు.

ఈ బైక్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.79,999

ప్రస్తుతం మార్కెట్లో బుకింగ్స్‌ కూడా జరుగుతున్నాయట. దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.79,999గా ఉందని కంపెనీ పేర్కొంది. ఐదేళ్ల వారంటీతో పాటు వచ్చే ఈ బైక్‌ తీసుకోవడానికి పలు బ్యాంకులు రుణ సౌకర్యం కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ వాహనాలు అంఏనే చార్జింగ్‌ షాకేట్‌లలో ప్రధానమైన సమస్యలు ఉంటాయి. మనం నిత్యం గృహావసరాల కోసం ఉపయోగించే షాకేట్స్‌తో చార్జ్‌ చేసుకోవడం కుదరదు. కానీ ఈబైక్‌లకు రెగ్యులర్‌ ఎలక్ర్టికల్‌ బైక్‌లకు అవసరమైన 25 యాంప్‌ అవసరం లేదు. సాధార‌ణ‌మైన గృహా అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకునే షాకెట్ ద్వారానే మ‌నం ఈ బైక్ ను చార్జ్ చేసుకోవ‌చ్చు.

ఇవీ చదవండి: Studds Helmet: ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే నింజా ఎలైట్‌ సూపర్‌ డి5 హెల్మెట్‌ విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌

Royal Enfield Bike: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.50 వేలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ బైక్.. ఏ మోడల్‌ అంటే..

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !