
వేసవి అంటేనే కార్ల యజమానులకు దినదిన గండంగా ఉంటుంది. అసలే వేడితో ఇబ్బంది పడాలంటే అదే సమయంలో కార్ల సమస్యలు సగటు వినియోగదారుడిని వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండలు పెరిగే కొద్దీ మీ కారు ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సిస్టమ్ సమస్యలను పెంచుతూ ఉంటుంది. కాబట్టి వేసవిలో కారులోని ఏసీ వర్కింగ్ కండిషన్‌లో ఉండేలా చూసుకోవడం చాలా కీలకం. సరిగ్గా పని చేయని ఏసీ మీ కారు ప్రయాణాన్ని ఇబ్బందిగా మారుస్తుంది. ప్రయాణాన్ని ఒక భయంకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా వేసవిలో కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభూతి పొందవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. వేసవి వేడి మీ ప్రయాణాలను చెడగొట్టకుండా, మీ కారు క్యాబిన్‌ను రిఫ్రెష్‌గా చల్లగా ఉంచడానికి చురుకైన చర్యలు తీసుకోవాలి. మండే వేసవిలో వేడిని తట్టుకోవడానికి, మీ కారు క్యాబిన్‌ను చల్లగా ఉంచుకోవడంలో కీలకమైన ఏసీలో సమస్యలకు చెక్ పెట్టడానికి నిపుణులు కొన్న సలహాలు ఇస్తున్నారు. నిపుణులు తెలిపే ఆ సూచనలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
వేసవిలో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభూతి చెందాలంటే వేసవికి ముందే మీ కారు ఏసీను సర్వీసింగ్ చేయించడం ఉత్తమం. సర్వీస్ చేసిన ఏసీ సిస్టమ్ సమర్థవంతంగా పని చేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మీకు అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది.
మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీ కారుని ముందుగా చల్లబర్చాలి. అంటే ప్రయాణానికి ముందే వేడి గాలి నుంచి తప్పించుకోవడానికి కొన్ని నిమిషాల పాటు కారు తలుపులు లేదా కిటికీలను తెరవాలి. మీ కారులో సన్‌రూఫ్ ఉంటే దాన్ని కూడా తెరవడం ఉత్తమం.
మీరు కారులోకి ప్రవేశించినప్పుడు ఏసీను ఆన్ చేసి మొదట రీసర్క్యులేషన్ మోడ్‌ను స్విచ్ ఆఫ్ చేయండి. ఇది ఏసీను స్వచ్ఛమైన బయటి గాలిని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. క్యాబిన్‌ను వేగంగా చల్లబరుస్తుంది. క్యాబిన్ ఉష్ణోగ్రత పడిపోయిన తర్వాత శీతలీకరణ సామర్థ్యాన్ని పెంచడానికి రీసర్క్యులేషన్ మోడ్‌ను తిరిగి ఆన్ చేయాలి.
గరిష్ట శీతలీకరణ కోసం ఏసీ ఉష్ణోగ్రతను అత్యల్ప సెట్టింగ్‌కు సెట్ చేయాలి. అలాగే గాలి ప్రవాహాన్ని పెంచాలి. అయితే ఇది మీ కారు ఇంధన సామర్థ్యాన్ని కొద్దిగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి.
మీరు ఒంటరిగా ప్రయాణిస్తుంటే మీ వైపు ఉన్న ఏసీ వెంట్‌లను మాత్రమే తెరిచి ఉంచాలి. మిగిలిన వాయు ప్రవాహాన్ని మీ వైపుకు మళ్లించాలి. అలాగే ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటే సరైన సౌలభ్యం కోసం ప్రయాణీకుల వైపు గాలి ప్రవాహానికి నేరుగా వెంట్‌లను సర్దుబాటు చేయాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..