IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ముమ్మర చర్యలు.. జూలై చివరి నాటికి బిడ్‌లు ఆహ్వానించే అవకాశం..

|

Jun 11, 2022 | 2:55 PM

ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జూలై చివరి నాటికి బిడ్‌లను ఆహ్వానించే అవకాశం ఉంది. ఐడిబిఐ వ్యూహాత్మక విక్రయానికి ఆర్‌బిఐతో మరో రౌండ్ చర్చలు అవసరమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ చెప్పింది...

IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణకు ముమ్మర చర్యలు.. జూలై చివరి నాటికి బిడ్‌లు ఆహ్వానించే అవకాశం..
Idbi Bank Jobs
Follow us on

ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జూలై చివరి నాటికి బిడ్‌లను ఆహ్వానించే అవకాశం ఉంది. ఐడిబిఐ వ్యూహాత్మక విక్రయానికి ఆర్‌బిఐతో మరో రౌండ్ చర్చలు అవసరమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ చెప్పింది. ఈ బ్యాంకులో ప్రభుత్వ వాటా 45.48 శాతం కాగా, ఎల్‌ఐసీ వాటా 49.24 శాతంగా ఉంది. ఈ వ్యూహాత్మక విక్రయంలో ఐడిబిఐ బ్యాంక్‌లో నిర్వహణ నియంత్రణను బదిలీ చేస్తారని, అయితే బ్యాంకులో ప్రభుత్వం, ఎల్‌ఐసి వాటా ఎంత విక్రయించబడుతుందో ఇంకా నిర్ణయించలేదని ఓ అధికారి తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గత ఏడాది మేలో సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఐడీబీఐ బ్యాంక్ చట్టంలో అవసరమైన సవరణలు కూడా చేశారు.

మీడియా నివేదికల ప్రకారం, IDBI బ్యాంక్‌లో వాటా విక్రయం కోసం రోడ్‌షోలో 10 మంది ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో టీపీజీ క్యాపిటల్, బ్లాక్ స్టోన్ వంటి ఇన్వెస్టర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇది కాకుండా KKR, వార్‌బర్గ్ పింకస్ వంటి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను ప్రీమియంకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఒక నివేదిక వచ్చింది. దాని ప్రకారం బ్యాంకులో తన వాటాను విక్రయించడానికి కన్సార్టియం బిడ్‌ను ప్రభుత్వం అంగీకరించవచ్చు. ప్రమోటర్ల వాటాను 26 శాతానికి తగ్గించేందుకు కాల వ్యవధిని పెంచేలా రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు జారీ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకు ఆ పని పూర్తి కాలేదు.