Prices go up: ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. అయితే ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోవాల్సిందే..

| Edited By: Pardhasaradhi Peri

Dec 28, 2020 | 7:00 AM

టీవీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. వచ్చే నెల నుంచి..

Prices go up: ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. అయితే ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోవాల్సిందే..
Follow us on

Prices go up: టీవీ, ఫ్రిజ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. వచ్చే నెల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు దాదాపు 10 శాతం పెరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయా కంపెనీల ప్రతినిథులు స్వయంగా ప్రకటించారు. ముఖ్యంగా ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పానసోనిక్ కంపెనీ ఉత్పత్తులపై 6 నుంచి 7 శాతం ధరలు పెరిగే అవకాశం ఉందని పానసోనిక్ ఇండియా సీఈవో ప్రకటించారు. ఇక జూన్ చివరికి నాటికి అది కాస్తా 10 నుంచి 11 శాతానికి పెరుగుతుందన్నారు. ఇక ఎల్జీ సంస్థ కూడా తన ప్రోడక్ట్స్‌పై 7 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన ధరలు జనవరి నుంచి అమల్లోకి వస్తాయని ఇప్పటికే ప్రకటించింది.

 

Also read:

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలను బెంబేలెత్తిస్తున్న పెద్దపులి.. పాదముద్రలును గుర్తించిన అధికారులు

ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ.. ఆసక్తి రేపుతున్న అధిష్టానం దూతతో చర్చలు..!