ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ.. ఆసక్తి రేపుతున్న అధిష్టానం దూతతో చర్చలు..!

వరుస అపజయాలు మూటకట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది అధిష్టానం. కోమటి రెడ్డి భేటీ పై సర్వత్రా ఆసక్తి .

ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ.. ఆసక్తి రేపుతున్న అధిష్టానం దూతతో చర్చలు..!
Follow us

|

Updated on: Dec 27, 2020 | 8:46 PM

వరుస అపజయాలు మూటకట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీలో దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సమూలంగా ప్రక్షాలన చేయాలని అనుకుంటోంది అధిష్టానం. టీ పీసీసీ చీఫ్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్.. వివిధ విభాగాలకు కొత్త వారిని నియమించనుంది. ఇందుకు సంబంధించి కసరత్తు దాదాపు పూర్తి అయ్యింది. వారం రోజుల్లో పీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ కేరా భేటీ అయ్యారు. ప్రస్తుత సమయంలో ఇద్దరి భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్‌ వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసిన పవన్ ఖేరాతో కోమటి రెడ్డి తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డితో పాటు జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్ రావు తో కలిసి పవన్ ఖేరాా సమావేశమయ్యారు. వీరి మధ్య కొత్త పీసీసీ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరుగుతున్నట్లు పార్టీవర్గాలు భావిస్తున్నాయి.