Doorstep Banking: ఇక క్యాష్ కూడా డోర్ డెలివరీ.. ఏటీఎం వరకూ వెళ్లాల్సిన పనిలేదు.. పోస్టాఫీస్ నుంచి కొత్త సర్వీస్..

|

Apr 28, 2024 | 3:42 PM

ఎందుకంటే కొన్ని చోట్ల ఈ డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేకపోయినా.. లేకపోతే అకస్మాత్తుగా సర్వర్ డౌన్ అయినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొంత మొత్తం బ్యాంకు లేదా ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచుతున్నారు. అయితే బ్యాంక్, ఏటీఎం వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారి ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన ఉంటుంది. ఈ క్రమంలో ఆ అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ను ఇండియా పోస్ట్ తీసుకొచ్చింది.

Doorstep Banking: ఇక క్యాష్ కూడా డోర్ డెలివరీ.. ఏటీఎం వరకూ వెళ్లాల్సిన పనిలేదు.. పోస్టాఫీస్ నుంచి కొత్త సర్వీస్..
Post Office
Follow us on

బ్యాంకింగ్ రంగం డిజిటల్ బాటలో వేగంగా ప్రయాణిస్తోంది. ఎక్కడ చూసినా క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. అందరూ క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు జరుపుతున్నారు. అయినప్పటికీ కొంత నగదు చేతిలో ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ డిజిటల్ లావాదేవీలు అందుబాటులో లేకపోయినా.. లేకపోతే అకస్మాత్తుగా సర్వర్ డౌన్ అయినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కొంత మొత్తం బ్యాంకు లేదా ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసి ఇంట్లో ఉంచుతున్నారు. అయితే బ్యాంక్, ఏటీఎం వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి ఏంటి? వారి ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిన ఉంటుంది. ఈ క్రమంలో ఆ అవసరం లేకుండా డోర్ స్టెప్ బ్యాంకింగ్ ను ఇండియా పోస్ట్ తీసుకొచ్చింది. పోస్టాఫీసు సాయంతో ఇంటి వద్ద నగదు విత్ డ్రా చేసుకొనే వెసులుబాటు కలుగుతోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ద్వారా ఇంటి వద్దే నగదు విత్ డ్రా చేసుకొనే అవకాశం ఉంటోంది. ఆధార్ ఆధారిత పేమెంట్(ఏఈపీఎస్) సేవ ద్వారా దీనిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధార్ ఏనేబుల్ పేమెంట్ సర్వీస్(ఏఈపీఎస్) ద్వారా పోస్టాఫీసు అందించే ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవల గురించి తెలుసుకుందాం..

ఏఈపీఎస్ అంటే..

ఆధార్ ఏనేబుల్డ్ పేమెంట్ సర్వీస్(ఏఈపీఎస్) అంటే ఆధార్ బయోమెట్రిక్ ద్వారా నిర్వహించే సర్వీస్. దీని సాయంతో బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేయొచ్చు. బ్యాలెన్స్ వివరాలు, నగదు విత్ డ్రా, రెమిటెన్స్ లావాదేవీలు దీని సాయంతో నిర్వహించవచ్చు. చిన్న మొత్తాలను బ్యాంకుకు వెళ్లే అవసరం లేకుండా విత్ డ్రా చేయొచ్చు. అత్యవసర పరిస్థితులో.. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయి.

ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలంటే..

ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ సేవలు అన్ని బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండదు. మీ ఖాతా ఉన్న బ్యాంకు కు ఏఈపీఎస్ సేవలందించే జాబితాలో ఉండాలి. అయితే దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకుల్లోనూ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వ్యక్తుల బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. ఆ ఆధార్ మీ ఫోన్ నంబర్ కు లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ తరహా లావాదేవీ సాధ్యమవుతుంది. డోర్ స్టెప్ లావాదేవి ఎంచుకున్నప్పుడు బయోమెట్రిక్ సాయంతో మీ నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. డోర్ స్టెప్ సేవలను వినియోగించుకోవాలంటే కొంత రుసుము అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 10వేలు మాత్రమే విత్ డ్రా చేసేందుకు అనుమతి ఉంటుంది. మీరు ఈ సేవను వినియోగించుకోవాలంటే సర్వీస్ రిక్వెస్ట్ ఫారమ్ లో వివరాలు తప్పనిసరిగా పొందుపరచాల్సి ఉంటుంది. దానిలో మీ పేరు, చిరునామా, మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీసు వివరాలు పొందుపరచాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..