డిజిటల్ లావాదేవీలు, సమాచారాన్ని పంచుకోవడం ఆనవాయితీగా మారిన ఈ యుగంలో మోసాలు కూడా చాలా రెట్లు పెరిగాయి. సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడే విధంగా కొత్త కొత్త మార్గాలనే అన్వేషిస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు నిపుణులను కూడా వారు కష్టపడి సంపాదించిన డబ్బును లాక్కుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు 658 సిమ్ కార్డులను ఒకే ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు గుర్తించారు. సిమ్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లకు పోలీసులు లేఖ రాశారని ఔట్‌లెట్ తెలిపింది. అయితే నేరగాళ్లు ఇలా మీకు తెలియకుండా కూడా మీ ఆధార్‌పై సిమ్ కార్డ్‌లు తీసుకునే అవకాశం ఉంది. వారు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ వద్ద లేని సిమ్ కార్డులు మీ ఆధార్‌పై ఉన్నట్లయితే వెంటనే బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. లేకపోతే సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పోలుకొండ నవీన్ పేరుతో సిమ్‌కార్డులు రిజిష్టర్ అయినట్లు గుర్తించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై తొమ్మిది సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. ఒక ఆధార్ నంబర్ ఇచ్చి ఎక్కువ కనెక్షన్లు తీసుకునే పెద్ద కుటుంబాలకు ఈ సౌకర్యం కల్పించారు. అయితే, ఈ నిబంధన దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ పేరుతో ఎన్ని SIM కార్డ్‌లు ఉన్నాయో తనిఖీ చేయడానికి DoT వెబ్‌సైట్ అందుబాటులో ఉంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం వెబ్‌సైట్ కి లాగిన్ చేయడం ద్వారా వినియోగదారు తన పేరుతో జారీ చేసిన సిమ్ కార్డ్‌ల సంఖ్యను తెలుసుకోవడమే కాకుండా, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్‌ను బ్లాక్ చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి