PNB Mega E-Auction: తక్కువ ధరలో ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ బంఫర్ ఆఫర్ మీకోసమే..!

|

Nov 26, 2021 | 8:32 AM

సొంత ఇల్లు కొనాలని కలలు కంటున్నారా..! అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ప్రత్యేక ఆఫర్‌తో ముందుకు వచ్చింది. దీంతో మీరు ఆస్తిని సులభంగా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

PNB Mega E-Auction: తక్కువ ధరలో ఇల్లు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ బంఫర్ ఆఫర్ మీకోసమే..!
Punjab National Bank
Follow us on

Punjab National Bank Mega E-Auction: ఈ ఏడాది ముగిసేలోపు సొంత ఇంటిని కొనుగోలు చేయాలని కలలు కంటున్నారా? అయితే మీ కలను నెరవేర్చుకోవడానికి మీ కోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్‌తో మీరు ఇల్లు, దుకాణం లేదా ఏదైనా ఇతర ఆస్తిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీ కోసం ప్రత్యేక ఆఫర్‌ని తీసుకొచ్చింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెగా ఈ-వేలం నిర్వహించనుంది. నవంబర్ 26న పీఎన్‌బీ మెగా ఈ-వేలం నిర్వహిస్తోంది. దీంట్లో మీరు కూడా పాల్గొని ఆస్తిని సొంతం చేసుకోవచ్చు. ఈమేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓ ట్వీట్ చేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించింది. మెగా ఈ-వేలంలో పాల్గొనడం ద్వారా తక్కువ ధరలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. దీనితో పాటు, మీరు ఈ-బిక్రే పోర్టల్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చని తెలిపింది. ఇవే కాకుండా వినియోగదారులు తమ సమీప పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ శాఖను సందర్శించి తగిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది.

బ్యాంకులు ఆస్తులను ఎందుకు వేలం వేస్తాయి?
ఆస్తుల వేలం జరగడం అనేది ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి మెగా ఈ-వేలం నిర్వహించాయి. అయితే ముందుగా ఈ ఈ-వేలం కింద ఏయే ఆస్తులను వేలం వేస్తారో తెలుసుకుందాం.

– నివాస, వాణిజ్య ఆస్తులు
– రుణం చెల్లించని సమయంలో
బ్యాంక్ ఆస్తిని తన స్వాధీనంలో తీసుకుంటుంది. ఆ తర్వాత వేలంలో ఉన్న ఆస్తిని బ్యాంక్ విక్రయించి బకాయిలను తిరిగి పొందుతుంది.
– పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ మాత్రమే కాదు, అనేక బ్యాంకులు ఇటువంటి ఆస్తులను వేలం వేస్తాయి.
– సకాలంలో రుణం తిరిగి చెల్లించలేకపోతే, ఆ ఆస్తిని బ్యాంకు
స్వాధీనం చేసుకుంటుంది. బ్యాంకు స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆస్తి బ్యాంకు యాజమాన్యంలో ఉంటుంది. కాబట్టి బ్యాంకు దానిని వేలం వేస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఇటువంటి మెగా ఈ-వేలానికి ముందు పబ్లిక్ నోటీసులు జారీ చేయడం ద్వారా బ్యాంకులు దీని గురించి ప్రజలకు తెలియజేస్తాయి. ఈ సమాచారం అధికారిక ట్విట్టర్ ఖాతా లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతాయి. కాబట్టి ఈ-వేలంలో పాల్గొనే ముందు, దాన్ని తనిఖీ చేసుకోవడం మంచింది. అలాగే, ఈ ఈ-వేలంలో పాల్గొనే ముందు, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. వాస్తవానికి, మెగా ఈ-వేలంలో పాల్గొనే వ్యక్తి డిజిటల్ సంతకాన్ని కలిగి ఉండాలి. ఈ-వేలం చేసే ఏజెన్సీతోని మాట్లాడుకుని కూడా ఈ వెలంలో పాల్గొనవచ్చు. ఈ వేలం సమయానికి లాగిన్ చేసి మీకు నచ్చిన ధరలో ఆస్తిని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది.

వేలంలో పాల్గొనడం ఎలా..
వేలంలో పాల్గొనడానికి, ముందుగా మీరు మీ మొబైల్ నంబర్, ఈమెయిల్-ఐడి సహాయంతో ఈ-వేలం ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే KYC పత్రాలను ముందుగా అప్‌లోడ్ చేయాలి. అనంతరం ఈ కేవైసీ పత్రాలు ఈ-వేలం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ధృవీకరిస్తారు. ఓకే అయితే మీకు యూజర్ నేమ్, పాస్ వర్డ్ అందిస్తారు. అనంతరం మీరు ఈ వేలం సమయానికి లాగిన్ అయ్యి, ఆస్తిని కొనుగోలు చేయవచ్చు.

Also Read: Saudi Arabia: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన సౌదీ అరేబియా.. కానీ ఆ ఐదు రోజులు..

Silver Price Today: పెరిగిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!