PM Mudra Scheme: ఇకపై డబ్బులే డబ్బులు.. ముద్రా లోన్ పథకంపై కేంద్రం బిగ్ డెసిషన్..

కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్ పథకంపై కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో రూ.5 వేల కోట్ల గ్యారంటీ కార్పస్ ఫండ్‌కు ఆమోదముద్ర వేసింది. దీంతో రాబోయే ఐదేళ్లల్లో చిన్న వ్యాపారులకు రుణాలు అందింనుంది. రూ.1.26 లక్షల కోట్ల విలువైన రుణాలు వ్యాపారులకు అందించనున్నారు.

PM Mudra Scheme: ఇకపై డబ్బులే డబ్బులు.. ముద్రా లోన్ పథకంపై కేంద్రం బిగ్ డెసిషన్..
Mudra Loan

Updated on: Nov 11, 2026 | 9:55 PM

ప్రధానమంత్రి ముద్రా లోన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా మరో నిర్ణయానికి నాంది పలికింది. రాబోయే ఐదేళ్లకు రూ.5 వేల కోట్ల గ్యారంటీ కార్పస్ ఫండ్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.1.26 లక్షల కోట్ల విలువైన రుణాలు వ్యాపారులు అందకోవడానికి మార్గం సుగమమైంది. నవంబర్ 11వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. చిన్న వ్యాపారులు చేసేవారికి ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఇప్పటికే చిన్న వ్యాపారం నడుపుతున్నా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఈ రుణం తీసుకోవచ్చు. చిన్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఆత్మనిర్బర భారత్ కలను సాకారం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఐదేళ్లల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువై రుణాలు

దేశవ్యాప్తంగా రాబోయే ఐదేళ్లల్లో రూ.1.26 లక్షల కోట్ల ముద్రా విలువైన రుణాలను మంజూరు చేయనున్నారు. చిన్న వ్యాపారుకుల దీని వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుంది. వారికి రుణాలు సులువుగా అందించేందుకు ఇది ఉపయోగపడనుంది. కేంద్రం రూ.5 వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు నష్టం భయం తగ్గుతుంది. దీని వల్ల రుణాలు వేగంగా మంజూరు చేస్తాయి. బ్యాంకులు సంకోచించకుండా ఎక్కువమందికి రుణాలు ఇచ్చేందుకు ఇది సహాయపడుతుంది. బ్యాంకులకు రుణాల విషయంలో నష్టభయం అనేది తగ్గుతుంది. రాబోయే ఐదేళ్లల్లో దేశవ్యాప్తంగా చిన్న దుకాణాలు, స్టార్టప్‌లు, తయారీదారులకు ముద్రా లోన్ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తు అనేది ఉండదు. చిన్న వ్యాపారాలు హామీలు లేదా పూచీకత్తు లేకుండా సులువుగా రుణాలు పొందవచ్చు. కేంద్రం దీనిని పెంచడం వల్ల రుణం పొందే సౌకర్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

ఎవరెవరికి ఎంత ప్రయోజనం..?

శిశు, కిశోర్, తరుణ్ కేటగిరీలుగా విభజించారు. శిశు కేటగిరీ కింద రూ.50 వేల వరకు, కిశోర్ కేటగిరీ కింద రూ.5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. కిరాణా దుకాణాలు, చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగం, చేతివృత్తులవారు, వీధి వ్యాపారులు వంటి చిన్న వ్యాపారులకు రుణం అందించారు. ఇక నిరుద్యోగ యువత సొంతంగా ఉపాధిని లేదా స్టార్టప్‌ను ప్రారంభించాలనుకుంటే కూడా అందిస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us