పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 వేల చొప్పున రూ.6000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం 11వ విడత నిధులు విడుదల చేసింది. అయితే కొంత మంది రైతులకు ఈ డబ్బులు రాలేదు. కారణం వారు ఈ కేవైసీ చేసుకోకపోవడమే.. మరి ఇప్పుడు వారు ఏం చేయాలంటే.. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ ప్రసెస్ కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. ఈకేవైసీని స్మార్ట్‌ఫోన్‌లో కూడా చెయ్యొచ్చు కానీ మీ ఆధార్ మొబైల్ నెంబర్‌కు లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింక్ లేకుంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవలోకి వెళ్లి మీ ఆధార్‌తో ఫోన్ నెంబర్‌ను లింక్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఇప్పటికే ఆధార్‌తో ఫోన్ నెంబర్ లింక్ అయినవారు వారి స్మార్ట్‌ఫోన్‌లో https://pmkisan.gov.in/NewHome3.aspx సైట్‌లోకి వెళ్లాలి. అందులో ఫార్మర్ కార్నర్ అని ఉంటుంది. అందులో మొదటి ఆప్షన్ ఈకేవైసీ ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ రీఫండ్, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆధార్ డిటైల్స్, బెనిఫిషరీ స్టేటస్, రిజిస్ట్రేషన్ స్టేటస్, బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది. ఇందులో ఈ కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లింక్ అయిన్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ నమోదు చేయగానే నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ 6 అంకెలు ఉంటుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసి సడ్మిట్ చేయగానే సక్సెస్‌ఫుల్ ఈకేవైసీ అని వస్తుంది. దీంతో మీ ప్రాసెస్ పూర్తవుతుంది. మొబైల్ నెంబర్ లింక్ కానివారు మీసేవకు వెళ్లి మీ బయోమెట్రిక్ ఇచ్చి ఫోన్ నెంబర్ లింక్ చేయించాలి. ఆ తర్వాత పైన ఉన్న ప్రాసెస్ ప్రకారం ఈకేవైసీ చేసుకోవాలి.