
దేశంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.6వేలను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 23 విడతలు విజయవంతంగా విడుదల చేసిన కేంద్ర సర్కార్ తాజాగా 24 విడత డబ్బులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో 24 విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు అధికారులు కొన్ని సూచనలు జారీ చేశారు.
పీఎం కిసాస్ కింద అందే పెట్టుబడి సాయం 24 విడత డబ్బులు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్యను కచ్చితంగా పొందాలని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 64,71,800 మంది రైతులు పీఎం కిసాన్ పొదుతున్నారని.. అయితే వీరిలో 52,06,777 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ర్టీలో రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మిగతా 7,34,215 మంది రైతులు సైతం వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పీఎం కిసాన్ తొలి విడత కింద డబ్బులు పొంది.. ఫార్మిర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయకపోయినా.. వారిని అనర్హులుగానే ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా విశిష్ట సంఖ్యను ఎలా పొందాలి?
స్టెప్-1: ఈ రిజిస్ట్రీ విశిష్ట నెంబర్ పొందేందుకు ముందుగా మీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఫార్మర్ రిజిస్ట్రీ అధికారిక పోర్టల్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన ఫార్మర్ రిజిస్ట్రీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్-2: తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, వచ్చిన OTPని సబ్‌మిట్ చేసిన మీ డీయిటేల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
స్టెప్-3: ఇప్పుడు అక్కడ మీ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని, మీ పాస్‌బుక్, సర్వే నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ డీయిటేల్స్ కరెక్ట్‌గా ఉంటే మీ భూమికి సంబంధించిన వివరాలు అక్కడ కనిపిస్తాయి.
స్టెప్-4: ఇప్పుడు మీ పేరు, చిరునామా, భూమి విస్తీర్ణం సరిచూసుకుని దరఖాస్తును సబ్మిట్ చేయండి. ప్రక్రియ విజయవంతం కాగానే మీ మొబైల్‌కు 11 అంకెల Farmer ID జారీ అవుతుంది. అంతే మీ పార్మర్ రిజిస్ట్రీ పూర్తయినట్టే.. ఈ నెంబర్ ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.