Farmers: రైతులకు అదిరిపోయే దసరా గిఫ్ట్.. నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..

పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. 24వ విడత కోసం రైతులు ఎప్పటినుంచో ఎదుచూస్తున్నారు. ఎల్‌నీవో పరిస్థితుల క్రమంలో పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని నిరీక్షిస్తున్నారు. అయితే రైతులు నిరీక్షణకు తెరపడింది. నిధుల విడుదలకు కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.

Farmers: రైతులకు అదిరిపోయే దసరా గిఫ్ట్.. నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..
Pm Kisan

Updated on: Sep 11, 2026 | 1:55 PM

పీఎ కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ తెలపనుంది. 24వ విడత నిధుల విడుదలకు సిద్దమవుతోంది. 23వ విడత నిధులను జూన్‌లో విడుదల చేయగా.. నాలుగు నెలలు కావొస్తోంది. దీంతో తర్వాతి విడత సొమ్మును రైతులకు అందించేందకు కేంద్రం సన్నద్దమవుతోంది. త్వరలోనే నిధులను విడుదల చేయనుండగా.. మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుందని తెలుస్తోంది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లో రూ.2 వేలు జమ కానున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే 24వ విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా రూ.6 వేలు రైతులకు కేంద్రం అందిస్తోంది. మూడు విడతలుగా నాలుగు నెలలకు ఒకసారి చొప్పున వీటిని విడుదల చేస్తోంది.

దసరా కానుకగా నిధులు

ఈ ఏడాది జూన్‌లో 23వ విడత సొమ్ము అందించగా.. నాలుగు నెలల తర్వాత అంటే అక్టోబర్ వస్తుంది. దీంతో వచ్చే నెలలో పీఎం కిసాన్ నగదు జమ కానున్నాయని సమాచారం. వచ్చే నెలలో దసరా పండుగ వస్తుంది. అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ రాబోతుంది. దీంతో పండుగ కానుకగా ఆలోపు పీఎం కిసాన్ నగదు పంపిణీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా ఎప్పటిలాగే ఈ నిధులను విడుదల చేయనున్నారు. మోదీ విడుదల చేయగానే రైతుల అకౌంట్లో రూ.2 వేలు పడనున్నాయి. దసరా తర్వాత నవంబర్ 8వ తేదీన దీపావళి పండుగ వస్తోంది. వరుసగా పండుగల సీజన్ వస్తుండటంతో పీఎం కిసాన్ త్వరగా అందించాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో ఎల్‌నీవో ప్రభావంతో వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. వర్షాలు లేకపోవడంతో పంట సాగుకు రైతులు దూరమవుతున్నారు. దీంతో రైతులకు ఆదాయం ఉండటం లేదు.

ఈకేవైసీ అనేది తప్పనిసరి..

ఈ పరిస్ధితుల క్రమంలో రైతులకు ఆర్ధికంగా తోడ్పాటు అందించేందుకు పీఎం కిసాన్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీంతో రైతులు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని నిరీక్షిస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ ఏటా 10 కోట్ల మంది రైతులకు కేంద్రం పట్టుబడి సాయం అందిస్తోంది. అయితే పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేవైసీ పూర్తి చేయకపోతే డబ్బులు నిలిచిపోతాయి. మీ సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్‌కు వెళ్లి దీనిని పూర్తి చేయవచ్చు. అలాగే పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కంప్లీట్ చేయవచ్చు. ఇక మీ సేవ సెంటర్లలో కూడా పూర్తి చేయవచ్చు. ఈకేవైసీ కోసం ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ అవసరం.

Loading...
Unable to load recommendations.
Follow Us