
కేంద ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అందిస్తోంది. అంటే ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం పంపిణీ చేస్తోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం లెక్కన నిధులు జమ చేస్తున్నారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ నిధులను ప్రతీ విడతలో బటన్ నొక్కి విడుదల చేస్తున్నారు. త్వరలో 23వ విడత నగదును విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.
-భారత పౌరుడై ఉండాలి
-సాగుకు అనుకూలమైన భూమి కలిగి ఉండాలి
-చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి. అంటే ఐదు ఎకరాల్లోపు పోలం కలిగి ఉండాలి.
-నెలకు కనీసం రూ. 10 వేల పింఛను పొందే పదవీ విరమణ పొందిన వ్యక్తి అయి ఉండకూడదు
-ఆదాయపు పన్ను దాఖలు చేసి ఉండకూడదు
-సంస్థాగత భూస్వామిగా ఉండకూడదు
– https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
– ‘కొత్త రైతు నమోదు’పై క్లిక్ చేయండి
-మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
– క్యాప్చాను ఎంటర్ చేయండి
-అవసరమైన వివరాలను నమోదు చేసి ‘అవును’పై క్లిక్ చేయండి
-పీఎం కిసాన్ దరఖాస్తు ఫారంలో అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేసి భద్రపరచండి. ఫారంను ప్రింటవుట్ తీసుకోండి
-https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లండి
-హోమ్ పేజీలో కుడి వైపున ఉన్న ‘మీ స్థితిని తెలుసుకోండి’ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
– మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా కోడ్‌ను పూరించండి
-అనంతరం ‘గెట్ డేటా’పై క్లిక్ చేయండి
-మీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను ఓపెన్ చేయండి
-‘లబ్ధిదారుల జాబితా’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటివి ఎంచుకోండి
-‘గెట్ డీటైల్స్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
పీఎం కిసాన్ 23వ విడత డబ్బులు 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. మార్చి 13న అస్సాంలోని గౌహతిలో 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. 9.32 కోట్ల మంది రైతులకు రూ. 18,640 కోట్లు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా రైతులకు 22 విడతలలో మొత్తం రూ. 4.25 లక్షల కోట్లు పంపిణీ చేశారు.