Petrol Price Today: ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Price) గత కొన్ని నెలలుగా మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు (crude oil price) పెరుగుతున్నా దేశంలో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. బుధవారం కూడా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేవు. అయితే ఇది శాశ్వతం కాదన్న వార్తలు ఇటీవల బలంగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెరగుతోన్న ముడి చమురు ధరల కారణంగా మార్చిలో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయనే చర్చ జరుగుతోంది. మరి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు జరగనున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే బుధవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41గా ఉండగా, డీజిల్ రూ. 86.67 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బుధవారం లీటర్ పెట్రోల్ రూ. 109.98 కాగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో నేడు లీటర్ పెట్రోల్ రూ. 101.40 గా ఉంది, ఇక డీజిల్ రూ. 91.43 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 కాగా, డీజిల్ రూ. 85.01 గా ఉంది.
* హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రోల్ రూ. 108.20 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది.
* విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.29 కాగా, డీజిల్ రూ. 96.36 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 109.05 వద్ద కొనసాగుతోంది, ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95.18 గా నమోదైంది.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్!
Barefoot: చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..