Petrol Diesel Price: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. దీంతో ఈరోజు కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదనే చెప్పాలి. ఇలా స్థిరంగా కొనసాగుతుండటంతో వాహనదారులకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి. ఇక హైదరాబాద్ (Hyderabad)లో గురువారం పెట్రోల్ (Petrol) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. లీటర్ పెట్రోల్ (Diesel) ధర రూ. 108.20 ఉండగా, డీజిల్ కూడా అదే దారిలో ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ.94.62 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
ఢిల్లీలో లీటర్ పెట్రలో ధర రూ.95.41 ఉండగా, డీజిల్ ధర రూ.86.14 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98 ఉండగా, డీజిల్ ధర రూ.94.14 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40 ఉండగా, డీజిల్ ధర రూ.91.43 ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67 ఉండగా, డీజిల్ ధర రూ.89.79 ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 ఉండగా, డీజిల్ ధర రూ.85.01 వద్ద కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పైపైకి కదిలాయి. క్రూడ్ ధరలు మళ్లీ 94 డాలర్లపైగా పయనిస్తున్నాయి. అలాగే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.46 శాతం పెరిగింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 94.82 డాలర్లకు పరుగులు పెట్టింది.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలను కూడా SMS ద్వారా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి 9224992249 నెంబర్‌కు SMS పంపాలి. మీరు హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే RSP 134483 అని టైప్ చేసి 9224992249 ఫోన్ నెంబర్‌కు మెసేజ్ (Message) పపితే ధరల వివరాలు వస్తాయి.
ఇవి కూడా చదవండి: