Petrol-Diesel Price Today: దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..!
Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత నెల రోజుల కిందట పెరుగుతూ వచ్చిన ధరలు..
Petrol-Diesel Price Today: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత నెల రోజుల కిందట పెరుగుతూ వచ్చిన ధరలు.. ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేటికీ దాని ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.105.41గా ఉండగా, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51, డీజిల్ ధర రూ.104.77గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 ఉండగా, డీజిల్ ధర రూ.96.67ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.51 ఉండగా, డీజిల్ ధర రూ.104.77 వద్ద ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.105.65కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర లీటరుకు రూ. 99.83 వద్ద ఉంది. అదే సమయంలో చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.85 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.100.94 వద్ద కొనసాగుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు
ఒకవైపు దేశవ్యాప్తంగా 39 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు నిలకడగా ఉండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల్లో నిరంతర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 112 డాలర్లుగా ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు సగటు ధర లీటరుకు $ 1.33 అంటే రూ. 102 స్థాయిలో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో సగటు పెట్రోల్ ధర లీటరుకు రూ.113గా ఉంది.
పెట్రోల్ పై పన్ను ఎలా ఉంది?
పెట్రోల్, డీజిల్‌పై పన్ను విషయానికొస్తే.. ఢిల్లీలో మే 1 నాటికి, పెట్రోల్ బేస్ ధర రూ.56.33. లీటరుకు రవాణా ఖర్చు రూ.0.20 వర్తిస్తుంది. ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.27.90, వ్యాట్ రూ.17.13. ఇందులో లీటరుకు డీలర్ కమీషన్ రూ.3.85. ఈ విధంగా 105.41 రూపాయలకు చేరుకుంది.