Petrol Diesel Price: మళ్లీ పెట్రో మంట.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

|

Oct 02, 2021 | 9:14 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మూడు వారాల సుధీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price: మళ్లీ పెట్రో మంట.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా చమురు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. మూడు వారాల సుధీర్ఘ విరామం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ కూడా పెరిగాయి. దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. గురువారం, శుక్రవారంతోపాటు శనివారం కూడా దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ ధరలు రాష్ట్రాలు విధిస్తున్న పన్నుల ప్రకారం.. మారుతుంటాయి. తాజాగా శనివారం లీట‌ర్ పెట్రోల్ పై 25 పైస‌లు, డీజిల్‌పై 33 పైస‌లు పెరిగింది.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.14 ఉండగా.. డీజిల్ రూ .90.47గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.108.19 కి పెరగగా.. డీజిల్ ధర రూ .98.16 కి చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.77 ఉండగా.. డీజిల్ రూ. 93.57 కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ .99.80 కి పెరగగా.. డీజిల్ ధర రూ .95.02 కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.26కి పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.72 కి చేరింది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.29కి పెరగగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.74కి చేరింది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.77 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.25గా ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.57 కు పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ.100.45 కి చేరింది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.19 కి చేరగా.. డీజిల్ ధర రూ. 99.14గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.87లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.77గా ఉంది.

Also Read:

Amazon Great Indian: ప్రైమ్‌ మెంబర్స్‌కు ఆఫర్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది.. ఈ భారీ డిస్కౌంట్లను గమనించారా?

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే.. రూ.3,300 పెన్షన్‌..!