Petrol – Diesel Price Today (24-01-2021): ఈ నెలలో చమురు ధరలు నాలుగో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. దీంతో హైదరాబాద్ సహా పలు నగరాల్లో గరిష్టస్థాయిని తాకాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.70గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 75.88గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.92.28 ఉండగా, డీజిల్ ధర రూ.81.74గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.15 ఉండగా, డీజిల్ ధర రూ.82.80 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.92 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ,ధర రూ.85.09 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్ లీటర్ ధర రూ.91.84కాగా, డీజిల్ ధర రూ.85.04 గా ఉంది.
వాహనదారులకు షాక్.. మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఐదు రోజులుగా పైపైకి.. ఈసారి ఎంతంటే..