Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న తేడాలతో..

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
Petrol Diesel Prices

Updated on: Dec 26, 2021 | 9:05 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చిన్న చిన్న తేడాలతో ధరలు కనిపిస్తున్నాయి. ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో కొద్దిగా తగ్గినట్లుగా కనిపించాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.92గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.35గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 109.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.47గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.37గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.72గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.69కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.75లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.05 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.18గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.96లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.69లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.75లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.50 ఉండగా.. డీజిల్ ధర రూ.91.52గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.29 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.81గా ఉంది.

ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us