Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివచ్చిన పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇలా వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో...

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. దిగివచ్చిన పెట్రోల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..
Petrol Price

Edited By:

Updated on: Aug 24, 2021 | 11:33 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఇలా వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత సంబుర పడిపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో దిగివచ్చాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.15గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.30గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.77గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.21గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.80గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.26గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.69ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.20 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.69గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.91 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.63 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.87 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.67 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.03లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.67గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.91 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.87లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.64 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.07 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.64గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.93 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.13 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.32ఉండగా.. డీజిల్ ధర రూ.93.66గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.13 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.49 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.70 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.45గా ఉంది.

ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …

CA Exams 2021: ఫైనల్, ఇంటర్ పాత కోర్సు పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్.. చివరి ప్రయత్నంగా మరో అవకాశం..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివాకు ప్రత్యామ్నాయం అవుతుందా? రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో చూడండి!

గాడ్ ప్రామిస్ నమ్మండి.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. Viral Videoపై స్పందించిన ఆర్జీవీ

Loading...
Unable to load recommendations.
Follow Us