Petrol Diesel Price: పెట్రోల్ ధరల్లో పెద్దగా కనిపించని మార్పు.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం..

|

Aug 23, 2021 | 8:20 AM

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలా వరుసగా 34 వ రోజు రికార్డు స్థాయిలో వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు...

Petrol Diesel Price: పెట్రోల్ ధరల్లో పెద్దగా కనిపించని మార్పు.. ఏపీ, తెలంగాణల్లో మాత్రం..
Petrol Price
Follow us on

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలా వరుసగా 34 వ రోజు రికార్డు స్థాయిలో వరుసగా మార్పులు లేకుండానే సాగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం కొంత సంబుర పడిపోతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపిస్తున్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.  

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..  

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.33గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.98గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.45గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.36గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.69గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.93ఉండగా.. డీజిల్ ధర రూ.97.42గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.90గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.21 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.19 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.95 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.97 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.98.16గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.12గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108.21 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.19లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.27 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 92.32 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.93.84గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.65 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.83 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.61గా ఉంది.