Petrol Diesel price Today: తెలుగు రాష్ట్రాల్లోనే మారుతున్న ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే?

|

Apr 20, 2021 | 6:47 AM

Petrol And Diesel Rates Today:వాహనదారులకు ఇటీవల కాలంలో కాస్త ఉపశమనం కలుగుతోంది. నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని

Petrol Diesel price Today: తెలుగు రాష్ట్రాల్లోనే మారుతున్న ధరలు.. ప్రధాన నగరాల్లో పెట్రో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel price Today
Follow us on

Petrol And Diesel Rates Today:వాహనదారులకు ఇటీవల కాలంలో కాస్త ఉపశమనం కలుగుతోంది. నిత్యం పెరుగుతున్న పెట్రో ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతోంది. అంతకుముందు ప్రతిరోజూ భారీగా పెరిగిన చమురు ధరలతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో ప్రజల జేబులు గుల్లయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే.. లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ దాటితే.. మరికొన్ని చోట్ల వందకు చేరువైంది. దీంతో వాహనాలను బయటకు తీసేందుకు భయపడ్డారు. ప్రస్తుతం కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ప్రస్తుతం పెట్రో ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది.

తెలంగాణలో..
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.93.99 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.05 గా ఉంది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.94.38 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.40 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో…
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పెట్రోల్ ధర కొంత మేర తగ్గింది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.44 గా ఉంది. నిన్న ధర 96.72గా ఉంది. డీజిల్‌ ధర రూ.89.12 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర రూ.95.57 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.12 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.69 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.22 గా ఉంది.

Also Read:

Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు… హైదరాబాద్.. విజయవాడ మార్కెట్లో రేట్స్ ఇలా ఉన్నాయి..