Petrol-Diesel Price: ఊరటనిస్తున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. మీ నగరంలో రేట్లను తెలుసుకోండిలా..?

Petrol-Diesel Price: దేశంలో వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్ ధరలు ఊరట కలిగిస్తున్నాయి. పరుగులు పెట్టిన చమురు ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. దేశంలో సోమవారం పెట్రోల్‌..

Petrol-Diesel Price: ఊరటనిస్తున్న పెట్రోల్‌ డీజిల్‌ ధరలు.. మీ నగరంలో రేట్లను తెలుసుకోండిలా..?
Petrol Diesel Price

Updated on: Jun 14, 2022 | 9:58 AM

Petrol-Diesel Price: దేశంలో వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్ ధరలు ఊరట కలిగిస్తున్నాయి. పరుగులు పెట్టిన చమురు ధరలకు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. దేశంలో సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.96.72 ఉంగా, డీజిల్ ధర లీటరు రూ.89.62 ఉంది. ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.111.35 ఉండగా, డీజిల్ రూ.97.28గా విక్రయిస్తున్నారు. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 ఉండగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అలాగే కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశంలోని 4 మహానగరాల్లో ప్రస్తుత పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చి చూస్తే, చమురు ధరలు ముంబై, ఢిల్లీలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు అత్యల్పంగా ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది.

రష్యాపై పునరుద్ధరించిన ఆంక్షల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఈ వారం 122 డాలర్ల వద్ద ముగిసింది. చైనా, భారత్‌ల నుంచి డిమాండ్ పెరగడంతో రానున్న రోజుల్లో ముడి చమురు ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర రాబోయే రోజుల్లో $ 128 కి చేరుకుంటుంది. చైనా, భారతదేశం నుండి డిమాండ్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. మీరు మీ నగరంలో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూడాలనుకుంటే మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తనిఖీ చేయవచ్చు .

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలు ఉన్నప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించగా, రిలయన్స్-బిపి మరియు నైరా ఎనర్జీ వంటి ప్రైవేట్ రంగ రిటైల్ యూనిట్లు నష్టాలను పూడ్చుకోవడానికి పరిమిత కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. కొన్ని చోట్ల, ప్రభుత్వ రంగ యూనిట్ల కంటే నైరా లీటర్ ఇంధనాన్ని రూ. 3 ఎక్కువగా విక్రయిస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ఇవి కూడా చదవండి

SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు

మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపితే ధరల వివరాలు వస్తాయి. HPCL కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9222201122 నంబర్‌కు పంపవచ్చు. BPCL వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్‌ చేసి 9223112222 నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ పంపితే ధరల వివరాలు వస్తాయి. అయితే ముడి చమురును 2 వేలకు పైగా వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి